ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలకళతో కళకళ

Devineni Uma

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలకళతో కళకళలాడుతోందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలో సాథారణ వర్షపాతం నమోదయ్యిందని, జలకళతో రాష్ట్రానికి నిజమైన దీపావళి వచ్చిందని ఉమ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన వైకాపాపై విమర్శల వర్షం కురిపించారు. ఎంపీలను ఢిల్లీకి తీసుకువెళ్లి పోలవరం నిర్మాణాన్నిఆపుతామని అనడం వైకాపా నేతల అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు.