ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పట్టిసీమ పవర్ పాయింట్

AP CM
AP CM chandra babu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పట్టిసీమ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సాధించిన విజయాలను ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. సభలో నదుల అనుసంధానంపై చర్చలో ఆయన మాట్లాడారు. పట్టిసీమను కేవలం ఏడాది కాలంలో పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. అత్యంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టుగా పట్టిసీమ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించిందని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది పట్టిసీమ నీటి ద్వారా కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత శాతం పంటలకు నీరందించే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.