ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి

TS CM KCR-1
TS CM KCR

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో డిమాండ్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కూడా చెప్పానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మోడీ ప్రత్యేక హోదా ఇస్తానంటే ఇవ్వాలి.. ఇవ్వనంటే ఇవ్వనని చెప్పాలే తప్పా.. ప్రజలతో ఆడుకోవడం సమంజసం కాదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్‌. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు.