ఆందోళనక‌రంగా మోత్కుపల్లి ఆరోగ్యం

motkupalli narasimhulu
motkupalli narasimhulu

హైదరాబాద్‌: శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆలేరు బిఎల్‌ఎఫ్‌ అభ్యర్ధి, మాజీ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. లోబిపితో పాటు ఛాతిలో విపరీతమైన నొప్పి, వాంతులు వచ్చాయని తెలుస్తుంది. అంబులెన్స్‌ సరైన సమయానికి రాకపోవడంతో సొంత వాహనంలోనే హైదరాబాద్‌కు తరలించారు.