ఆంక్షలు అమలుచేయకుంటే ఏంచేస్తామో వేచి చూడండి

MIKE PAMPIO
MIKE PAMPIO

అమెరికా రక్షణ మంత్రి మైక్‌ పాంపియో
వాషింగ్టన్‌: ఇరాన్‌ నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ ముడిచమురు కొనుగోళ్లు చేస్తున్న చైనా,భారత్‌లపైనే కాకుండా ఇతర దేశాలపై తీసుకునే చర్యలు ఏమిటన్నది వేచిచూడాల్సిందేనని అమెరికా రక్షణ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. ఇరాన్‌పై గతంలో ఎన్నడూలేనివిదంగా కఠినమైన ఆంక్షలు అమెరికా ప్రకటించింది. సోమవారంనుంచి ఈ ఆంక్షలను మరింతగా కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్‌తో బహుళ దేశాల అణుడీల్‌ను రద్దుచేయాలనన అమెరికా అధ్యఓఉడు డొనాల్డ్‌ట్రంప్‌ వివాదాస్పద నిర్ణయం ఈ ఆంక్షలకు దారితీసిందనే చెప్పాలి. ఈ ఆంక్షలవల్ల కంపెనీలుపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. మూడోతరం దేశాలు ఇరాన్‌తో వ్యాపారంచేస్తున్న దేశాలన్నింటికీ చర్యలు ఉంటాయని అమెరికా రక్షణ మంత్రి హెచ్చరికలుచేసినట్లుగా సంకేతాలిచ్చారు. అయితే అమెరికా తాత్కాలికంగా ఎనిమిది దేశాలకు ఆంక్షలను రద్దుచేసినప్పటికీ భవిష్యత్తులోకూడా ఈ మినహాయింపులు ఉంటాయన్న నిర్దిష్టమైన భరోసా లేదు. ఇరాన్‌సుప్రీం నేత అయతొల్లాఆలి ఖొమైనీ శనివారం అమెరికా చర్యలను ఖండించారు. ట్రంప్‌ అమెరికా ప్రతిష్టనుదిగజారుస్తునానరని, దేశాలమధ్య సుదీర్ఘకాలం పాటుయుద్ధంనడిచేవిదంగా వ్యవహరిస్తున్నారని, అమెరికాచర్యలు ఆమోదించదగినవి కావని అన్నారు. అమెరికా ప్రకటించిన ఆంక్షలు సోమవారం అర్ధరాత్రినుంచి అమలులోనికి వస్తున్నట్లుపాంపియో వెల్లడించారు. ఉగ్రవాదం ఉన్న దేశంగా టెహ్రాన్‌ తన దేశంలో మార్పులు చేపట్టాలని కోరారు. ప్రపంచ చమురు మార్కెట్లుసైతం ఈ ఆంక్షలపై స్పందించాయి. ఆంక్షల పలితాలను అధిగమించేందుకు కార్యాచరణ చేపడుతున్నాయి. అందరికళ్లు ఇపుడు ఇరాన్‌ ఎగుమతులపైనే ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం ఉత్పత్తి తగ్గుతుందని భయాందోళనలు వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్‌ దేశస్తులు అమెరికా ఆంక్షలపై ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. చమురు ఉత్పత్తి మార్కెటింగ్‌ ఒక్కటే ఇరాన్‌కు ప్రధాన ఆదాయవనరుగా ఉంది. అయితే కత్తికి రెండువైపులా పదును ఉంటుందన్నట్లు ఇరాన్‌ ఒపెక్‌ దేశాల్లో మూడో అతిపెద్ద చమురుదేశంగా కొనసాగుతోంది. అమెరికా ఆంక్షలఫలితంగా ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ ఘోరంగా దెబ్బతిన్నది. మేనెలనుంచి ఇప్పటివరకూ మూడింట రెండొంతులకుపైగా క్షీణించింది. ఇరాన్‌ చమురు ఎగుమతులు ఆంక్షలనేపథ్యంలో రోజుకు మిలియన్‌ బ్యారెళ్లకుపైగా తగ్గిపోయాయి. భారత్‌,చైనాలు కొనుగోళ్లను కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కువగాయూరోపియన్‌లు జపాన్‌, దక్షిణకొరియా వంటిదేశాలునిలిపివేసాయి. భారత్‌చూనాలు రెండింటిని ఇరాన్‌ చమురుకొనుగోళ్లను ఆరునెలల్లోపు నిలిపివేయాలన్న స్పష్టమైన ఆదేశాలేమైనా అమెరికానుంచి ఉన్నాయా అన్న ప్రశ్నపై మేమేంచేస్తామో వేచిచూడండి అని పేర్కొన్నారు. తాజా ఆంక్షలప్రకటనకు ముందే వేలాది మంది రపజలు ఇరాన్‌లో 1979 అమెరికా ఎంబసీలో చేపట్టిన కిడ్నాప్‌ ఘటన వార్షికోత్సవాన్ని నిర్వహించారు. అమెరికా జెండాలు, నకిలీ డాలర్లను తగులబెట్టి తమ నిరసనప్రకటించారు.