అహం – ప్రేమ

Lord Krishna, Arjuna
Lord Krishna, Arjuna

అహం – ప్రేమ

పిల్లలు ప్ఞట్టగానే ఏమాత్రం అహం అనే భావం ఉండదు. క్రమక్రమంగా పెరిగేకొద్ది అది ఏర్పడుతుంది. ఏవో చిన్నచిన్న కోరికలు కల్గుతాయి. పెద్దవారయ్యే సరికి ఆ అహం కూడా ఒకరూపాన్ని పొందుతుంది. అయితే సాధారణంగా పల్లెటూరి వాళ్ళలో, పట్టణా ల్లోని కూలినాలి చేసికుని బ్రతికేవారిలో, కాయకష్టం చేసేవారిలో అది అంతమందంగా ఉండదు. ఏదో పలుచగా ఉంటుంది. నేను, నా భార్య, నా పిల్లలు అంటుంటాడు గానీ ఆకలిదప్ఞ్పలు తీర్చుకుని కాలం వెళ్ళదీస్తుం టాడు. ఒకడు చదువ్ఞని డిగ్రీలు సంపాదిం చాడు. ఆ అహం కొంచెం పెద్దదవ్ఞతుంది, మందమవ్ఞతుంది. వాడు డబ్బు సంపాదిస్తే అది ఇంకా పెద్దదవ్ఞతుంది. ఇంకా మందమవ్ఞతంది.

పండితుడై పేరుప్రతిష్టలు వస్తే దానిసైజు, దాని మందం ఇంకా పెరిగిపోతుంది. ఇక వానికి అధికారమొస్తే, పెద్ద పదవి వస్తే ఇతరులు మనుషులుగా కనపడనంత పెద్దదిగా,దట్టంగా మారిపో తుంది ఆ అహం. కంట్లో భౌతికపొరలు ఏర్పడితే కంటి డాక్టర్‌ను సంప్రదించి, చికిత్స తీసికొని, సక్రమమైన చూప్ఞ తెచ్చుకోవచ్చు. కానీ ఈ అహంకారమనే దట్టమైన, మందమైన పొర వాని తలలో ఏర్పడితే చాలాచాల కష్టం. ఆ పొరను ఆ భగవం తుడొక్కడే తీసివేసి సాధారణ దృష్టిని అతనికి ప్రసాదించగలడు. అయినా అలాంటి పరిస్థితి కలుగకుండా జాగ్రత్తపడాలి. ఏ రంగంలో ఉన్నవారికి అహం ఉన్నా అంతనష్టం కలుగదుగానీ, విద్యారంగంలో వ్ఞన్నవారికి అది ఏమాత్రం ఉండరాదు.

విద్య యొసగును వినయంబు అన్నారు. పండిట్‌ అని పట్టభద్రుడని, మాస్టర్‌ అని డాక్టర్‌ (పిహెచ్‌డి) అని ఎన్నెన్నో డిగ్రీలుండి ఉపాధ్యాయులుగా, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా ఉన్నవారికి అహం ఏ కోశాన ఉండరాదు. విద్యాలయంలో ఉన్నప్ఞ్పడు విద్యార్థులతో, తోటి సిబ్బందితో, బయట ఉన్నప్ఞ్పడు సర్వసామాన్య జనంతో కలిసిమెలసి జీవించాలి. మేము విద్యావం తులం, మేము ఉన్నతులము అన్న గర్వం ఏమాత్రం ఉండరాదు. అసలు విద్యావం తుడంటే ఎవరు? పండితుడంటే ఎవరు? గొప్పగొప్ప డిగ్రీలుండేవాడా? విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవశ్వపాకేచ పణ్ణి´తాః సమదర్శినః (భగవద్గీత 5 అ 18 శ్లోకం) దీని అర్ధం : విద్య, వినయము కలిగియున్న బ్రాహ్మణుని యందును, గోవ్ఞ నందును, ఏనుగు నందును, కుక్క యందును, కుక్క మాంసము వండుకుని తిను చండాలుని యందును సమదృష్టి గలవారే (వారిని సమముగా చూచువారే) జ్ఞానులు అని చెప్పబడుదురు. (ప్ఞట 407-గీతా మకరందము) పండితునికి ఆ డిగ్రీలు ఎన్నిఉన్నా లేకపోయినా ఈ గుణాలు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. లేకపోతే విద్యారంగం భ్రష్టుపట్టిపోతుంది. కొన్ని వేలమంది విద్యార్థులు వక్రమార్గంలో నడిచి దుష్టబుద్ధులను అలవరచుకుంటారు. అలాంటివారితో ఏర్పడే సంఘం ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం.

ఒక ప్రభుత్వ విద్యాసంస్థలోని అధ్యాపకుడు నేను అగ్రకులానికి చెందినవాడిని, నేను గొప్ప వంశానికి చెందినవాడను అని అంటూ ఇతర ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేయటానికి నిరాకరిస్తే, నా మడి ఆచారాలు భంగం అవ్ఞతాయని తలిస్తే ఇక అలాంటి వాడు ప్రభుత్వ ధనాన్ని,ప్రజల ధనాన్ని, వేల రూపాయలను ప్రతి నెల పొందుతూ తన వృత్తికి ఏమాత్రం న్యాయం చేయగలడు? అందరితో కలిసి పని చేయవలసిన ఉద్యోగంలో చేరటానికి అడ్డురాని మడి, ఆచారాలు, అందరితో కలిసి తినాల్సివచ్చినప్ఞ్పడు అడ్డు వస్తాయా? మడి, ఆచారాలే ముఖ్యమనుకుంటే ఇంట్లోనే ఉండి వాటిని శ్రద్ధగా పాటించ వచ్చు కదా? ఇక ఇలాంటి వారు భావి భారతపౌరులైన విద్యార్థులకు కులమత భేదా లుండరాదని, కలిసి బ్రతుకుటే బలం అని ఎలా బోధించగలరు? ఉత్తమ బోధ కాదు, ఆచరణ ద్వారా బోధ ఉండాలని కదా గాంధీ మహత్ముడు, సత్యసాయి పదేపదే చెప్పేది.

ఆచరణ లేని బోధ వ్యర్థం: ఇలాంటి వ్యక్తులకిచ్చే లక్షల రూపాయల జీతం వ్యర్ధం, దుర్వినియోగమైనట్టే. అయినా అత్యంత ప్రధానమైన విద్యారంగంలో బోధకులే వర్గభేదాన్ని, వర్ణభేదాన్ని పెంచి పోషిస్తే ఇక నవసమాజం వచ్చేదెప్ఞ్పడు? సమసమాజం స్థాపింపబడేదెట్లు? విద్యార్థుల పసిమెదళ్ళలో భేదబీజాలను నాటితే ఇక వారి హృద యాల్లో ప్రేమాంకురము జరిగేదెప్ఞ్పడు? ప్రేమ పెరిగితే కదా అహం నశించేది? అహం నశిస్తేనే కదా ఆధ్యాత్మికత అలవడేది? ప్రేమ జనించినా అహం నశిస్తాది లేదా అహం నశిస్తే ప్రేమ జనిస్తాది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు ఇంట్లో ఉన్నప్ఞ్పడు వారి తల్లి దండ్రులు, పాఠశాలల్లో ఉన్నప్ఞ్పడు వారి బోధకులు, వారి ఆచరణ ద్వారా అహం భావాన్ని నిర్మూలించటాన్ని, ప్రేమనుపెంచి, పంచటాన్ని నేర్పాలి. అప్పుడే మనదేశ నాయకుల కలల్ని,ఆధ్యాత్మిక గురువ్ఞల బోధనల్ని సఫలం చేసినవా రమవుతాం. ధన్యులతాం. ప్రతి ఒక్కరిలో ఉండవలసింది అహంకారం కాదు, ప్రేమ. మరి ముఖ్యంగా విద్యావంతుల్లో ఇది మరింత ఆవశ్యకం.

– రాచమడుగు శ్రీనివాసులు