అస్వస్థతకు గురైన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌

SUDARSAN-PATTNAIK
SUDARSAN-PATTNAIK

ఒడిశా: కాలుష్య బారిన పడిన బంకిముహానా ప్రాంతంలోని సముద్ర తీరాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతూ మంగళవారం
నుంచి నిరాహారదీక్ష చేస్తున్న సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను భువనేశ్వర్‌లోని
అపోలో ఆసుపత్రికి తరలించారు. అతనికి బి.పి. డౌనై, జ్వరంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు
తెలిపారు. సముద్రతీరం కలుషితం కావడంతో తీవ్ర ఆవేదన చెందిన ఆయన దీనిని కాపాడుకోవాలసిన ఆవశ్యకతను చాటిచెపుతూ పలు
సైకత శిల్పాలను రూపొందించారు.