అస్వస్థతకు గురైన ‘ట్రాజెడి కింగ్‌ దిలీప్‌ కుమార్‌

DILIP KUMAR
DILIP KUMAR

 

ముంబాయి: హాలీవుడ్‌ హీరో ట్రాజెడీ కింగ్‌ దిలిప్‌ కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో బుధవారం మధ్యాహ్నాం ముంబాయిలోని
లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండగా
ఆస్పత్రిలో ఆడిట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 94 సంవత్సరాలు. ఆయన నటించిన చిత్రాలు దేవ్‌దాస్‌,
మొఘల్‌ ఈ అజామ్‌, గంగా జమునా, నాయ దౌర్‌, మధుమతి బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాసిన సంగతి
తెలిసిందే. చివరగా 1998 సంవత్సరంలో ‘క్విలా అనే చిత్రంలో నటించారు. దిలీప్‌కు 1994లో దాదాసాహెబ్‌ పాల్కే,
2015 పద్మ విభూషణ్‌ అవార్డులు వరించాయి.