అసెంబ్లీ స్థానాల పెంపు ఉండబోదు: భన్వర్‌లాల్‌

Bhanwar Lal
Bhanwar Lal

ద్వారకా తిరుమల: పశ్చిమగోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ శుక్రవారం నాడు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజక వర్గాల పెంపు ఉండబోదని ఆయన అన్నారు. ఏపి పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏపిలో అసెంబ్లీ స్ధానాలు 175 నుంచి 225కు,  తెలంగాణలో 119 నుంచి 153కు పెరగాల్సి ఉన్నాయని, ఐతే 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 వరకూ పునర్విభజనకు అవకాశం లేదని ఆయన అన్నారు. ఓటు హక్కులేని పౌరులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.