అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ పర్యటనలు

ప్రతిసారీ ఇదే తంతు..
అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ పర్యటనలు
రాజధాని అమరావతిలో అనువైన భవవనాల పరిశీలన
మొదట ఏఎన్‌యూ, రెండోసారి తుళ్లూరు, ఇప్పుడు.. కేఎల్‌యూ
భూముల ధరల పెంపు ప్రక్రియకేనని గుసగుసలు

రాజధాని పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే పాలకుల ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. మాట ఇవ్వడం.. తప్పడం.. ఆపై ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అన్ని హామీలను తప్పక అమలు చేస్తామని సర్ది చెప్పడం రివాజుగా మారింది. అసెంబ్లీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయనగానే ముందు నవ్యాంధ్ర రాజధానిలోనే శాసనసభ సమావేశాలు అంటూ ప్రకటన ఒకటి విడుదల అవుతుంది. దీనికి అనుగుణంగానే సభాపతి కోడెల శివప్రసాదరావు రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటనలు షురూ చేస్తారు.

kodela siva prasad

ఆపై ఏదో ఒక సాకు చెప్పి తూచ్.. అనడం ఇప్పటికే రెండు సార్లు జరిగిపోయింది. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఇదే తంతు కొనసాగుతోంది. ఒకసారి ఏఎన్‌యూ.. రెండోసారి తుళ్లూరు అన్న స్పీకర్.. ఇప్పుడు కేఎన్‌యూ అనువుగా ఉందని చెబుతున్నారు. ఈ తంతును గమనిస్తున్న విద్యావంతులు భూముల ధరల పెంపు ప్రక్రియలో భాగంగానే ఈ వ్యవహారం ఇలా కొనసాగుతోందని గుసగుసలాడడం కొసమెరుపు.