అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు భారీ భద్రత

 

Security
Security

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి మొదలవనుండడంతో పోలీసులు భారీ భద్రత చేబట్టారు. ఇటీవల జ రిగిన రాజకీయ పరిణామాలు, ప్రజా సంఘాల ఆందోళన నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో ముందస్తుగా నిషేధాజ్ఞలు విధించారు. రెండు వారాలకు పైగా జ రగనున్న ఈ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లోపల, వెలుపలా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూసేందుకు సాయుధ బలగాలను కూ డా రంగంలో దించారు.
అసెంబ్లీ సమావేశాంటేనే పోలీసులు హడలెత్తిపోయే రోజులివి. అందునా బడ్జెట్‌ సమావేశాలంటే ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు పోరాటం చేసే సమయ మిది. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం అన్ని విభాగాలకు కేటాయింపులు జరిపే సంగతి అందరికి తెలిసిందే. ఈ కేటాయింపుల్లో ఓ విభాగానికి లేదా మరేదైనా వర్గాని కి అన్యాయం జరిగిందని అనిపించినా దానికి సంబంధించిన వారు ఆందోళనకు దిగడం విదితమే. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమీప ప్రాంతంలో ధర్నాలు చేయడం వీ లైతే శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించడం వంటివి చేయడానికి ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు అసెంబ్లీ వద్ద ఆందోళనలు జరగడం, ఇంకొన్నిసార్లు శాసనసభలోని దూసుకుపోవడం వంటి ఘటనలు జరిగాయి. ఇటీవల కాలంలో జరిగిన ఘటనలను పరిశీలి స్తే ఎంఆర్‌పిఎస్‌ కార్యకర్తలు రిజర్వేషన్ల అంశంపై ఉమ్మడి ఎపి హయాంలో ఏకంగా శాసనసభ భవనంపై ఎక్కి గంటల తరబడి ఆందోళనకు దిగడం సంచలనం రేపిం ది. దీని తరువాత ఉమ్మడి ఎపి హయాంలోనే తెలంగాణ సాధన కోసం జెఎసి నాయకులు అసెంబ్లీ వరకు దూసుకు వచ్చిన ఉదంతాలు అనేకసార్లు జరిగాయి. ఈ స మయంలోనే అసెంబ్లీ వద్ద రక్షణ కోసం మరో అంచె భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా బలగాల కోసం ప్రత్యేకంగా ఓ మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మార్గం ఏర్పాటైన తరువాత అసెంబ్లీ సమావేశాల సమయంలో భద్రతా బలగాలు ఇక్కడ నిరంతరం మొహరించసాగాయి. అయినప్పటికీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావే శాల సమయంలో ఇందిరా పార్కు, సుందరయ్య పార్కుల వద్ద ఆందోళనకు దిగిన ప్రజా సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు చాలాసార్లు పోలీసుల వ లయాన్ని చేధించుకుని శాసనసభ వరకు దూసుకువచ్చిన ఘటనలు అనేకం వున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలతో ఇందిరా పార్కు వద్ద వున్న ధర్నా చౌక్‌ ను సర్కారు ఏడాది క్రితం బలవంతంగా ఎత్తివేసింది. ప్రజాభిప్రాయ సేకరణ పేరిట స్థానికులచేత బలవంతంగా ధర్నా చౌక్‌ వద్దని ఆందోళన చేయించి మరీ దీనిని ఎ త్తి వేయడం వివాదాలకు తావిచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలతో పాటు మఫ్టీలో వున్న పోలీసులు వుండడం విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీ సమావేశాల స మయంలో ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు దిగే ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు చాలాసార్లు అసెంబ్లీ, సచివాలయం వైపుకు దూసుకువచ్చిన ఉదంతాలు వుండడంతో నే ధర్నా చౌక్‌ను ఇక్కడి నుంచి తొలగించామని పోలీసులు చెబుతున్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు భద్రత ఏర్పాటు చేయడం పోలీసులకు కత్తిమీద సాములా మారడంతోనే ముందస్తుగా నిషేధాజ్ఞలు విధించారు. అసెంబ్లీ లోపలకు కేవలం శాసనసభ్యులు, అనుమతులు వున్న అధికారులు, మీడియా సిబ్బంది, విధి నిర్వహణలో వున్న పోలీసులు మినహాయించి ఇతరులు రాకుండా చూడాలని ఉన్న తాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ భవనాన్ని పోలీసులు ఇప్పటికే తమ అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నుంచి మొదలుకానున్న సమావేశా ల కోసం లోపల, వెలుపల పెద్ద సంఖ్యలో సాయుధ బలగాలను మొహరించారు. సమావేశాలు జరిగే సమయంలో ఆందోళనకారులు అసెంబ్లీ వైపు రాకుండా వుండేం దుకు నాంపల్లి, రవీంద్ర భారతి చౌరస్తా, ఇక్బాల్‌ మినార్‌ చౌరస్తా, పబ్లిక్‌ గార్డెన్‌ చౌరస్తా, బాబు జగజీవన్‌ రాం చౌరస్తా, బషీర్‌బాగ్‌ చౌరస్తా, ఏ ఆర్‌ పెట్రోల్‌ బంకు చౌరస్తాతో పాటు సచివాలయం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి, బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో పోలీసులను మొహరించారు. ఎక్కడైనా తేడావచ్చి ఆందో ళనకారులు దూసుకువస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బడ్జెట్‌ సమావేశాలు సాఫీగా సాగేందుకు చేబట్టిన భద్రతా ఏర్పాట్లను ఉన్న తాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.