అసెంబ్లీ పరిసరాల్లో రెండు నెలలు ఆంక్షలు

TS Assembly
TS Assembly

హైదరాబాద్‌ : భద్రతా చర్యల్లో భాగంగా అసెంబ్లీ పరిసరాల్లో రెండు నెలల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఐదుగురు అంతకు ఎక్కువ మంది గుమికూడి ఉండడం, ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం, ఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు, లాఠీలు, కత్తులు, స్టిక్‌లు, బ్యాట్‌లు తీసుకుని తిరగడం, లాంటి చర్యలను నిషేధిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులకు ఈ నియమాలు వర్తించవు. నిషేధాజ్ఞలు ఈ నెల 23న ఉదయం 6గంటల నుంచి మార్చి 22 ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.