అసెంబ్లీ ఎన్నిక‌ల్లోను టిఆర్ఎస్ సెంచ‌రీ

Danam Nagender
Danam Nagender

హైద‌రాబాద్ః గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన త‌ర‌హాలోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి సెంచరీ కొడుతుందని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… కుటుంబ పాలనంటూ నోరు పారేసుకుంటున్న ఉత్తమ్.. తన కుటుంబానికి ఒకే సీటని ఉత్తమ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏ కూటమి జట్టు కట్టినా టిఆర్ఎస్ పార్టీదే గెలుపు అని దానం అన్నారు.