అసెంబ్లీలో సీఎం చంద్ర‌బాబు భావోద్వేగ ప్ర‌సంగం

Chandrababu naidu
Chandrababu naidu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగంతో కంటతడిపెట్టారు. రాజధాని నిర్మాణంపై మాట్లాడుతూ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. “రాజధాని అంటే డ్రీమ్‌ సిటీ అని హేళన చేస్తారా?. రాజధానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా?. ఆర్థికంగా బలంగా ఉన్న బెంగళూరు మెట్రోకు రూ.17వేల కోట్లు ఇచ్చారు. ముంబై, బెంగళూరుకు నిధులిచ్చి ఏపీకి ఎందుకివ్వడం లేదు?.ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయితే కేంద్రానికే ఎక్కువ ఆదాయం. పొరుగు రాష్ట్రాల కంటే గొప్పగా రాజధాని నిర్మించాలన్నది నా కల” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.