అసమ్మతి బుజ్జగింపునకు పైలట్‌ కసరత్తులు

Sachin pilot
Sachin pilot

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉందని సంకేతం
జైపూర్‌: మంత్రివర్గం ఏర్పాటయిన మరుసటిరోజే సీనియర్లనుంచి వెల్లువెత్తిన అసమ్మతిని బుజ్జగించేందుకు రాష్ట్రకాంగ్రెస అధ్యక్షుడు సచిన్‌పైలట్‌ సమీపభవిష్యత్తులోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సంకేతాలిచ్చారు. సీనియర్‌ నాయకులకు పనిచేసే అవకాశం ఇస్తామని వెల్లడించారు. కొత్తప్రభుత్వంలోమంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో కొందర సీనియర్లు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. సమాజంలోని ప్రతి వర్గానికి మంత్రివర్గంలోప్రాతినిధ్యం కల్పించామని పైలట్‌ వెల్లడించారు. కేవలం ఇది మొదటిసారి మాత్రమేనని, మరోసారి విస్తరణ ఉంటుందని తద్వారా మరికొందరికి పనిచేసేఅవకాశం కల్పిస్తామని అన్నారు. మొత్తం 23 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. వీరిలో 13 మంది కేబినెట్‌ మంత్రులు, పది మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారంచేసారు. మొత్తం 18 మంది కొత్తముఖాలకు రాష్ట్రకేబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించారు. సిపిజోషి, దీపేంద్రసింగ్‌ వంటివారు రాజ్‌భవన్‌లోజరిగిన ప్రమాణస్వీకారానికి రాలేదు. అలాగే సీనియర్‌నేతలు బ్రిజేంద్రోలా, పరశురామ్‌మోర్డియా, రాజేంద్ర పరీక్‌, మహేష్‌ జోషి వంటివారిని రాష్ట్ర కేబినెట్‌లోనికి తీసుకోలేదు. కమాన్‌నుంచి వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాహిదాఖాన్‌ మద్దతుదారులు, గుడా మాలానినుంచి హేమారామ్‌చౌదరి మద్దతుదారులు వీదుల్లోనికి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేసారు. తమ నాయకులకు మంత్రిపదవులు కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తంచేసారు. ఇద్దరునేతలు గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసినవారే. ఇప్పటివరకూ 25 మంది మంత్రులు ముఖ్యమంత్రి, డిప్యూటి ముఖ్యమంత్రులతోసహా మంత్రివర్గం ఏర్పాటయింది. కేబినెట్‌కు 30 మందివరకూ మంత్రివర్గాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది.