అసమాన ప్రతిభావంతుడు పి.వి.

                           అసమాన ప్రతిభావంతుడు పి.వి.

PV NARSSIMHARAO
PV NARSSIMHARAO

సాంఘిక అసమానతలను నిరసించిన వ్యక్తి. గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడ్డ వ్యక్తి. 13వ ఏటనే రాజకీయాల్లో ప్రవేశించాడు. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌కు సాధారణ కార్యదర్శిగా పని చేసాడు. స్వాతంత్య్రం వచ్చాక కరీంనగర్‌ కాంగ్రెసులో సభ్యత్వం పొందాడు. రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేశారు. 1962, 1967, 1972 సంవత్సరంలో మూడు సార్లు రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్‌.ఎల్‌.ఏగా ఎన్నికై ‘హ్యాట్రిక్‌ను అప్పట్లోనే సుసాధ్యం చేసుకున్న వ్యక్తి ఆయన. ఆయన మొట్టమొదటిసారిగా 1957లోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు.రాష్ట్ర కాంగ్రెసుకు ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడుగా పని చేసి, ఇచ్చిన బాధ్యతలకు దక్షతతో న్యాయం చేశారాయన. సమాచార, న్యాయ, దేవాదాయ, న్యాయస్థాన వ్యవహార, విద్యాశాఖలకకు మంత్రిగా పనిచేసి వన్నె తెచ్చిన వ్యక్తి.

పి. వి.నరసింహారావు గురించి చెప్పాలంటే 15 లక్షల మాటలైనా సరిపోవు. ఎందుకంటే ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, మేధావి, బహుభాషా వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇన్ని వైవిధ్యాలున్న రాజకీయ నాయకుడు. ఆధునిక భారత నిర్మాతే కాదు సృష్టికర్త కూడా. కొత్త విదేశీ ఆర్థిక విధానాల వ్యూహకర్త, వేదాంతి, నిపుణుడు, లక్ష్యసాధకుడు, పండితుడు, సంస్కరణాభిలాషి, వక్త, ప్రయోక్త. సంపూర్ణ వ్యక్తిత్వమున్న మహా మనిషి, ఆదర్శప్రాయుడు, సంగీత సాహిత్యాభిలాషి, విద్యాభి మాని, విద్యావేత్త. మహోన్నత ఆశయాలున్న మహాను భావుడు. దేన్నీ, లెక్కచేయని తత్త్వం. మహాత్ముడు, అజాతశత్రువు. వైరి వర్గంచే సైతం బహు ప్రశంసలు, పొగడ్తలు పొందిన వ్యక్తి. ఆయనను ఎవ్వరితోను పోల్చలేము. అపరచాణుక్యుడని, స్థితప్రజ్ఞుడని, కర్మయోగి అని, రాజర్షి అని, విజ్ఞాని అనిహుందా, గాంభీర్యాలకు ప్రతిరూపమని, సాధారణ జీవితం గడిపి, అసా ధారణ గమ్యాలను చేరుకున్న మహా మహితాత్ముడని, మృదుభాషి అని,బహువిధాలుగా పిలిపించుకున్న వ్యక్తి.

ఆయన వ్యూహరచన అద్భుతం. దౌత్యం అనిర్వచనీయం. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ, రాయలసీమ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన, తెలుగు వచ్చిన, తెలుగు తెలిసిన, పండితుడైన ప్రధానమంత్రి. అటు యావత్ప్ర పంచంలోను పేరెన్నికగన్న, మన్ననలు పొందిన, పరువు ప్రతిష్ఠలు గలిగిన, మర్యాద గౌరవాలు కలిగిన వ్యక్తి. ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆయనను అందలం ఎక్కించాయి. బ్రహ్మరథం పట్టాయి. ఆయనలోను సామ ర్థ్యం,పనితనం, శక్తి, ప్రతిభాపాటవం, తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నాయని రుజువు చేశాయి.ఆయన జననం 1921 జూన్‌ 28 వ తేదీన, కరీంనగర్‌ జిల్లా భీమదేవర మండలం వంగర గ్రామంలో. మెట్రిక్యులేషన్‌ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, బి.యస్సీ. డిగ్రీ పట్ట భద్ర, న్యాయశాస్త్ర మందు ప్రవేశం, బూర్గుల రామకష్ణారావు వద్ద న్యాయవాద వత్తికై సహాయకునిగా చేరటం, నైజాం పాల నకు వ్యతిరేకంగా ‘వందేమాతరం ఉద్యమం నడపటం, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనటం,హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ సారథి స్వామి రామా నంద తీర్థ వద్ద శిష్యరికం, ఇత్యాది సంఘటనలు ఆయన బాల్య, యౌవ్వన దశలందు జరిగిన, ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన సంఘటనలు.

ఆయన తన గురువులకే ఆదర్శప్రాయుడు.ధనికుడైనా నిరుపేదను కరుణించే మానవత్వమూర్తి. గ్రామీణ క్రీడలు, ఈత, అల్లరి చిల్లరి చేష్టలు ఆయన బాల్యంలోని విశేషాలు, బంధుత్వానికి ప్రాధాన్య మిచ్చే వ్యక్తి. జ్ఞాపకశక్తి మెండుగా కలవాడు. విద్యావేత్త కావాలని అహర్నిశలు శ్రమించి అభ్యాసం చేసిన వ్యక్తి.పట్టుదల, దీక్ష, ఏకా గ్రత, బుద్ధికుశలత, మెండుగా కలవాడు శ్రమదమాదులకు వెను కంజ వేయని వ్యక్తి. కనుకనే న్యాయశాస్త్రమందు గోల్డ్‌ మెడలిస్టు.సాంఘిక అసమానతల ను నిరసించిన వ్యక్తి. గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడ్డ వ్యక్తి. 13వ ఏటనే రాజకీయాల్లో ప్రవేశిం చారు. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌కు సాధారణ కార్యదర్శిగా పని చేసాడు. స్వాతంత్య్రం వచ్చాక కరీంనగర్‌ కాంగ్రెసులో సభ్యత్వం పొందాడు. రాజకీయా ల్లో అక్షరాభ్యాసం చేశారు. 1962, 1967, 1972 సంవత్సరం లో మూడు సార్లు రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్‌.ఎల్‌.ఏగా ఎన్నికై ‘హ్యాట్రిక్‌ను అప్పట్లోనే సుసాధ్యం చేసు కున్న వ్యక్తి ఆయన. ఆయన మొదటిసారిగా 1957లోనే అసెంబ్లీ లో అడుగు పెట్టారు.రాష్ట్ర కాంగ్రెసుకు ప్రధాన కార్యదర్శిగా, ఉపా ధ్యక్షుడిగా పని చేసి, ఇచ్చిన బాధ్యతలకు దక్షతతతో న్యాయం చేశారాయన.

సమాచార, న్యాయ, దేవాదాయ, న్యాయస్థాన వ్యవహార, విద్యాశాఖలకకు మంత్రిగా పనిచేసి వన్నె తెచ్చిన వ్యక్తి. మెరుగులు పెట్టిన వ్యక్తి. పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వ్యక్తి. ఇంట ర్మీడియట్‌ విద్య, డిగ్రీ స్థాయిలో తెలుగు వాడకం, తెలుగు అకాడమీ స్థాపన, డిటెన్షన్‌ పద్ధతి రద్దు పాఠశాల స్థాయిలో నిరక్షరాస్యత నిర్మూలన, యస్‌.యస్‌.సి. పరీక్షలకు కామన్‌ విధానం, గ్రేడు పద్ధతి,పాఠశాల స్థాయిలో యూనిట్‌ పరీక్షల నిర్వహణ ఇత్యాధి సంస్కరణలను రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా తెచ్చిపెట్టి, అమలు చేసిన వ్యక్తి.నేషనల్‌ డిఫెన్సు నిధికోసం విరాళాల సేకరణ ఆయన చేసిన సాంఘికసేవ. 1962లో చైనాతో యుద్ధ తరుణాన ఆయన పూనుకుని చేసిన ఘనకార్యమది. భూసంస్కరణల బిల్లు, సీలింగు చట్టం, పంచాయతీ రాజ్య వ్యవస్థలో గణనీయ సంస్కరణలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ముఖ్య కార్యాలు. ఆయన అధ్యయనవాది. తను చెప్పింది మొదట తనే పాటించి, ఆచరించి, అమలు చేసి ఆదర్శంగా నిలిచేవాడు. నిలదొక్కుకునేవాడు. తన స్వంత ఆస్తి 790 ఎకరాలను పేదలకు పంపిణీ చేసి, భూసంస్కరణల చట్టం అమలు తనతోనే మొదలు పెట్టి చూపిన వ్యక్తి ఆయన.1977లో పార్లమెంటేరియన్‌గా కేంద్ర స్థాయిలో అడుగు పెట్టారు.

కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో తయారీలో ప్రముఖ పాత్ర వహించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల ప్రభు త్వాలలో వివిధ శాఖలను కడు సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి. విదేశాంగ శాఖ, ఆంతరంగిక శాఖ, ప్రణాళికాశాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలకు ఆయన కేంద్ర మంత్రిగా సార థ్యం వహించారు. మానవ వనరుల శాఖా మంత్రిగా ఉన్నప్పుడు జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి, నవోదయ విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. రాజీవ్‌గాంధీ ఆకస్మిక మరణంతో, తొలుత ఆలిండియా కాంగ్రెసు కమిటికి అధ్యక్షుడిగా ఎన్నికై, తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. 1991 జూన్‌ 21 నుంచి 1996 మే 10 వరకు నిరాటంకంగా ఆ బాధ్యతను తన నిర్వ ర్తించి, తగిన మెజారిటీ లేకున్నా దేశాన్ని ఏలి, రాజకీయ సుస్థిర తను, ప్రజలకు శాంతిభద్రతలను తనదైన శైలిలో ప్రసాదిం చారు. ‘మండల్‌ ‘మసీదు వంటి సునిశిత సమ స్యల నుండి దేశాన్ని, జాతిని నడిపించి ప్రగతి బాటన పయనిం పచేశారు. అలీన ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారు. పాశ్చాత్య దేశాలను ‘లుక్‌ ఈస్ట్‌ నినాదంతో జాగతం చేశారు. ఐదు సార్లు పార్లమెంటుకు ఎన్నికైన తెలుగుబిడ్డ ఆయన.సమకాలీన రాజకీయాలపై ఓర్పుతో, నేర్పుతో పట్టు సాధించిన వ్యక్తి.

ఆర్థిక సంస్కరణలను ఎంతో విశాల దక్పథంతో, దూరదష్టితో అమలు చేసి, తన రాజకీయ పరిపక్వతను చాటిచెప్పారాయన. ప్రస్తుత భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో మార్పులను మలుపు తిప్పారా యన. అమెరికా, జర్మనీ లలో ఆయన చేసిన రాజకీయ సంబంధ ఉపన్యాసాలు పలువురిని ముగ్ధులుగా చేశాయి.ఆయనకు సాహిత్యమంటే మక్కువ ఎక్కువ. పదిహేడు భాషలందు ప్రావీణ్యం, ప్రవేశం ఉన్న వ్యక్తి. సాహిత్య సంప్రదాయాలన్నింటిలో దాదాపు ఆయనకు ప్రవేశముంది. కథకుడు. పద్యకర్త. గేయ రచయిత. నవలాకారుడు. వ్యాఖ్యాత. విమర్శకుడు. మంచి అను వాదకుడు. పీఠికాకర్త. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు నవలను సహస్ర ఫణ్‌ పేరుతో హిందీలో అనువదించి, ఆయనకున్న ‘సాహిత్య రత్న పట్టాకు సార్థకత తెచ్చిపెట్టాడు. ‘ఏది పాపం?, ‘మహాదేవి వర్మ రచనా వైశిష్ట్యం-ఒక పరిశీలన, ‘ఉద్భవుడు గోపికలు, ‘మంగయ్య అదష్టం ‘గొల్లరామవ్వ, ‘మంత్రి గారు మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని. మరాఠీ నవలను సైతం ఆయన అనువదించాడు.

ఆత్మకథ వంటి ‘ది ఇన్సైడర్‌ రచనను ఆయన ప్రధాని పదవీ విరమణ తర్వాత చేశారు. ఆంధ్ర సంస్కృతి, భారతీయ వైభవం, అవధాన ప్రక్రియ ఇత్యాది విషయాలపై ఆయన అద్భుతంగా ఉపన్యసించి, శ్రోతలను ఆకట్టు కోగల దిట్ట ఆయన.మూకీ సినిమాలలోని మాస్టర్‌ విఠల్‌ నటనన్నా, టాకీ సినిమాలలోని కన్నాంబ, కాంచనమాలల నటనన్నా ఆయనకు ఎంతో ఇష్టం. గూడవల్లి రామబ్రహ్మం ఆయన అభిమాన దర్శకుడు. శాస్త్రీయ సంగీతం అంటే ఆయన చెవి కోసుకునేవారు. ఆధునిక భారత చరిత్రలో యన స్థానం పదిలం. భారతీయ నాగరికత, సంస్కృ తులకు ఆయన ప్రాణమిచ్చేవారు. కాల్పనిక సాహిత్యం, రాజకీయ వ్యాఖ్యానాలు, వివిధ భాషలను నేర్చుకోవడం, సాహిత్యం చదవడం, తెలుగు, హిందీలలో పద్యాలు రాయడం ఆయనకెంతో ఇష్టమైన పనులు. నాటకాలంటే ఆయనకు అభిమానం.కంప్యూటర్ల వాడిన మొదటి దేశపు ప్రధానని ఆయన. పి.వి. అంటే ‘పవర్‌ ఫుల్‌ విజన్‌ అని పేరొందారాయన. నైతిక విలువలను గౌరవించే వారు. నిస్వార్థ జీవి. నిరాడంబరుడు, నిగర్వి.వ్యక్తిగత జీవితంలో తండ్రిగా కూడా ఆయన తన విద్యుక్త ధర్మం నెరవేర్చారు.
– డి.ఎల్‌.నరసింహ్మరావ్ఞ