అశోక్‌బాబును టిడిపిలోకి ఆహ్వానించిన సియం

ASHOK BABU
ASHOK BABU

విజ‌య‌వాడః ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబును తెలుగుదేశం పార్టీలో చేరాలని సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. మరో ఏడాదిలో అశోక్ బాబు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించాలని, వచ్చే ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి ఆయన్ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, చంద్రబాబు ఆహ్వానం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఎన్జీవో నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్టు అశోక్ బాబు ఈ ఉదయం విజయవాడలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఉద్యోగులకు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, తప్పకుండా చేస్తానని చెప్పిన ఆయన, అది ఏ రూపంలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని, భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.