అవి ఇతరులకు అనవసరం

Vidhyabalan11
Vidhyabalan

అవి ఇతరులకు అనవసరం

సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ గురించి తెలుసుకోవటం అంటే ఎంత క్రేజ్‌ ఉంటుందో.. మీడియాకు కూడ అంత ఉత్సాహం ఉంటుందంటారు.. అదే పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ని అయితే రెగ్యులర్‌గా అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది.. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ కు డకూ ఇదే ప్రశ్న ఎదురైంది.. అయిదేళ్ల క్రితం విద్యాబాలన్‌ వివాహం చేసుకున్నారు.. అయితే ఇప్పటి వరకూ సినిమా చేసుకుంటోంది మినహా పిల్లల ఊసు ఎత్తలేదు.. ప్రస్తుతం బేగమ్‌ జాన మూవీ కోసం ప్రమోషన్స్‌ చేస్తున్న విద్యాకు పిల్లల విషయంలోనే ఓ ప్రశ్న ఎదురైంది.. దీంతో ఈసినియర్‌ భామకు చిర్రెత్తుకొచ్చిందట.. ఎడా పెడా మాటలతోనే వాయించి పడేసింది.. ‘ ఈ విషయం నాకు నా భర్తకు మినహా తప్ప వేరే ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు అంటూ కుస్సుబుస్సులాడిన విద్యా.. ఆ తర్వాత మరింత గట్టిగానే రిటార్ట్‌ ఇచ్చారు. ‘పిల్లలపై అంత మమకారం ఎందుకు .. నేనేమీ పిల్లలను తయారుచేసే మెషీన్‌ని కాదు.. ప్రస్తుతం ప్రపంచ జనాభా ప్రమాదకర స్థాయికి చేరింది.. ఒక జంటకు పిల్లలు లేకపోయినా ఏం పర్లేదు.. పిల్లలు కచ్చితంగా ఉండాలనే రూలేమీ లేదు.. అంటూ విద్యాబాలన్‌ షాకిచ్చింది.