అవిశ్వాసానికి భయపడి మోది తప్పించుకుంటున్నారు: నక్కా

Nakka Anandbabu
Nakka Anandbabu

అమరావతి: ఈ దేశంలో ఎంతో మంది అవిశ్వాసం ఎదుర్కొన్నారని ..ఈనాడు అవిశ్వాసానికి భయపడి మోది తప్పించుకుతిరుగుతున్నారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మోది ది మేకపోతు గాంభీర్యమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోకాళ్లపై పడి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విజయసాయి రెడ్డి తాకట్టు పెట్టారని ,రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని నక్కా ఆనందబాబు అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే నీ చరిత్ర బయట పెడతామని విజయసాయి రెడ్డిని మంత్రి హెచ్చరించారు.