‘అవిశ్వాసం ‘వైపు టిఆర్‌ఎస్‌?

TS CM KCR
TS CM KCR

‘అవిశ్వాసం’ వైపు టిఆర్‌ఎస్‌?

కేంద్రంపై అవిశ్వాసతీర్మానం నోటీసిచ్చిన ఎపి టిడిపి
టిఆర్‌ఎస్‌ వ్యూహంపై నేడు నిర్ణయించనున్న సిఎం

హైదరాబాద్‌ / అమరావతి µ: పార్లమెంట్‌లో వరుసగా పదో రోజు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. రిజర్వేషన్ల హక్కు లను రాష్ట్రాలకు ఇవ్వాలనే డిమాండ్‌తో టిఆర్‌ఎస్‌ ఎంపీలు శుక్రవారంనాడు కూడా లోక్‌సభలో నిరసన తెలిపారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టిడిపిలు ఆవి శ్వాసం తీర్మానం నోటీసులు ఇచ్చాయి. ఈ విష యాన్ని స్పీకర్‌ సభలో ప్రకటిస్తూ ఆవిశ్వాసానికి మద్దతు తెలిపే సభ్యులు తమ స్థానాల్లో నిలబడాలని కోరారు.అప్పటికే టిఆర్‌ఎస్‌తో పాటు పలు పార్టీల ఎంపీలు వెల్‌లో ఆందోళనలు కొనసాగిస్తుండటంతో సభ గందరగోళంగా మారింది.

అయితే, అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతూ పలు పార్టీల ఎంపీలు నిలబడి మద్దతు తెలిపినప్పటికీ సభ ఆర్డర్‌లో లేకపో వడంతో నోటీసులను సభ ముందుకు తీసుకురావడం లేదని స్పీకర్‌ ప్రకటించారు. సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, మోడీ ప్రభుత్వానికి వ్యతి రేకంగా టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టిఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చే విషయంపై శనివారంలోగా నిర్ణయం తీసుకోనుంది. వారం,పది రోజుల క్రితం ఇదే విషయంపై మీడియా ప్రస్తావించగా, కేంద్ర సర్కార్‌పై అవిశ్వాసం తీర్మానం వట్టి చిల్లర రాజకీయం, కేంద్ర ప్రభుత్వం పడిపోదని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేమని టిఆర్‌ఎస్‌ ఎంపీలు అంటున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టిన చంద్రబాబు కాంగ్రెస్‌,లెఫ్ట్‌,అన్నా డిఎంకె, ఎస్సీ,ఎంఐఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలను గంటలోనే కూడగట్టిన ఘనత టిడిపి అధినేత చంద్రబాబుకు దక్కింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాం, మోడీపై మాకు విశ్వాసంలేదు, మారాష్ట్రాన్ని మోసం చేశారు.చట్టంలో ఉన్నవి కూడా అమలు చెయ్యటం లేదని చెప్పి గంట సమయం ముగిసిందో లేదో పైన పేర్కొన్న పార్టీలు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మా నానికి మద్దతు ఇచ్చారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు 48, అన్నా డిఎంకెకు 37 మంది ఎంపీలు ఉన్నారు. మిగతా పార్టీలనుకూడా కలుపుకుంటే దాదాపు వంద మందికి పైగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి,తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అయితే ట్వీట్‌ చేసి మరీ చంద్రబాబుని అభినందించారు. జగన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాసం ఎలాగూ ముందుకు రాదని, ఇదంతా డ్రామా అని గ్రహించారు. వెంటనే తన ఎంపీల చేత అవిశ్వాసం పెట్టించారు. నోటీస్‌పై సోమవారం 54మంది ఎంపీ లతో సంతకాలు చేయించి మరీ పట్టించి, చిత్తశుద్ది చాటుకున్నారు. ఒకే ఒక గంటలో మోడికి వ్యతి రేకంగా రాజకీయ శక్తులను కూడగట్టి జాతీయ స్థాయిలో రాజకీయం పెను సంచలనంగా మారింది.

8రాష్ట్రాల ఎంపీలు టిడిపికే మద్దతు కేంద్రంలో బిజేపి ప్రభుత్వానికి ఇటు రాజ్యసభలో అటు లోక్‌సభలలో పూర్తిస్తాయిలో మెజార్టి ఉన్న కేంద్రంపై ఎవ్వరు అవిశ్వాస తీర్మానం పెట్టినా వీగిపోతాదని అందరికీ తెలిసినా టిడిపి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రజల్లో చెడ్డ చేయడానికి వైఎస్సార్సీ,జనసేన పార్టీలు అవిశ్వాసాన్ని తెరపైకీ తీసుకొని రావడంతో బాబులోక్‌సభ సభ్యుడు, టిడిపి పక్షనేత తోట నరసింహంతో కేంద్రంకు నోటిసును శుక్రవారం ఇప్పించారు.

రాష్ట్రంలోని 25 ఎంపీల్లో టిడిపికి 17మంది,.బిజేపికి ఇరువురు, వైఎస్సార్సీకి 5గురు, గీతా ఒకరున్నారు. వైఎస్సా ర్సీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్న కేవలం తెరపైకీ వచ్చి టిడిపిని ఇరకాటంలో పెట్టడానికి అవిశ్వాస తీర్మానం అంటు కేంద్రంకు టిడిపితో పాటు వైసీపీలు నోటీసులిచ్చారు. వైఎస్సార్సీ నోటిసు ఇచ్చితాము టిడిపికి మద్దతు ప్రకటించారు. దేశంలోని సిపిఐ, సీపిఎం,సమాజ్‌వాది, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, తృణ ముల్‌, ఆప్‌,ఎంఐఎంలు టిడిపి మద్దతుగా నోటిసు జారీకే 57మంది ఎంపీలు సంతకాలు చేసిన్నట్లు తెలిసింది.

ఎన్డీఎ నుంచి శుక్రవారం టిడిపి తెగదెంపులతో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీ, సమాజ్‌ వాదీ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌,తదితరులు బాబుకు ఫోన్‌చేసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించినట్లు తెలిసింది.బాబు గురువారం రాత్రి నుంచి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేలోపే జాతీయస్థాయిలో నేతలతో సంప్రదింపులు చేయాగా 11పార్టీలకు చెందిన అగ్రనేతలతో చర్చించినట్లు వినికిడి.