‘అవిశ్వాసం ‘పెట్టినా మెజారీటీ బిజెపికే

MODI
MODI

‘అవిశ్వాసం’ పెట్టినా మెజారీటీ బిజెపికే

న్యూఢిల్లీ: ఎన్‌డిఎతో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పటికీ బిజెపి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ చెపుతోంది. లోక్‌సభలో ఆ పార్టీకి 315 మంది సభ్యుల మద్దతు ఉంటుం దని, బిజెపికి సొంతంగానే 274 మంది సభ్యుల బలం ఉందని పార్టీనేతలు చెపుతున్నారు. ప్రస్తు తం 270కి మించే సంఖ్యాబలం ఉందని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ఉపఎన్నికల్లో పార్టీఓటమి పాలుకావ డంతో సంఖ్యాబలం 274కిపడిపోయింది.

మిత్ర పక్షాలు 41 మందివరకూ ఉన్నారు. శివసేన 18 మంది సభ్యులుకూడా మిత్రపక్షంగా కొనసాగు తున్నారు. ఐతే టిడిపి ప్రతిపాదించిన అవిశ్వా సానికి ఓటు వేసేదీ లేనదీ స్పష్టంగా ప్రకటించ లేదు. ఇతరులు లోక్‌జనశక్తి పార్టీ ఆరు, అకాళీ దల్‌ నాలుగు, రాష్ట్రీయ లోక్‌ సంతాపార్టీ 3, అప్నాదళ్‌ 2, జెడియు 2, ఎఐఎన్‌ఆర్‌సి, జెకెపిడిపి, ఎన్‌పిపి, పిఎంకె, ఎస్‌డిఎఫ్‌, స్వాభి మానిపక్ష వంటివి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.