అవినీతి పాపం ఎవరి పుణ్యం?

Corruption
Corruption

అవినీతి పాపం ఎవరి పుణ్యం?

చేసింది చెప్పుకోవడం చాలా సులభం. కానీ చెప్పింది చేయడం చాలా కష్టం. అది అందరి వల్ల సాధ్యమయ్యేపనికాదు. అందులో రాజకీయాల్లో మ రింత కష్టం. ఎన్నికల్లో ఓట్ల కోసం అధికార పీఠం ఎక్కేం దుకు ఎన్నో ఆపదమొక్కులు మొక్కుతుంటారు. అవన్నీ అమలు చేయలేమని, చేయరని, అటు చెప్పేవారికి, వినే వారికి స్పష్టంగా తెలుసు.

అయినా వారు చెప్తూనే ఉంటా రు. వీరు వింటూనే ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అయితే ఏమి చేయాలి? బాధ్యత పదవ్ఞల్లో ఉండి పలువ్ఞరికి ఆదర్శంగా ఉండాల్సి న మాటలకు చేతలకు పొంతనలేకుండాపోతే ఏమనుకో వాలి?మహావృక్షంలా పెరిగి పట్టిపీడిస్తున్న అవినీతినే తీసు కుందాం.దీన్ని కూకటివేళ్లతో పెకలించివేస్తాం, ఉక్కుపాదం తో అణచివేస్తామంటూ పెద్దపెద్ద ప్రకటనలే చేస్తుంటారు. సందర్భం వచ్చినా రాకపోయినా అవినీతి గురించి దాదాపు అధికారంలో ఉన్న ప్రతినాయకుడు మాట్లాడే మాటలు ఇవే. అవినీతికి పాల్పడినవారికి చట్టపరంగా చర్యలు తీసు కుంటాం, కటకటపాలు చేస్తామని కూడా హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇటీవల ఒక నేత మరో అడుగు ముందుకు వేసి లంచం అడిగిన వారిని ఏకంగా చెప్పుతో కొట్టమని బహిరంగంగానే ప్రకటించారు.

అయినా అవినీతి ఆగడం లేదు. మొన్న పవిత్రమైన హిందూ దేవాలయ వ్యవస్థలో సీని యర్‌ అధికారిపై అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో వంద కోట్ల రూపాయలకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు కనుగొన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఇది మరిన్ని కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇదేకాదు గత రెండుమూడేళ్లుగా ఇరు రాష్ట్రాల్లో ఎసిబి అధికారులు జరు పుతున్న దాడుల్లో ఒకటి రెండుకాదు వందల కోట్లలో అక్ర మాస్తులు వెలుగు చూస్తున్నాయి. పాలకులు హెచ్చరికలను ఈ అక్రమార్కులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విష యం ఈ దాడుల్లో వెలుగు చూస్తున్న వందలాది కోట్లు చెప్పకనే చెబుతున్నాయి. అవినీతి అనేది ఇప్పటికప్పుడు పుట్టుకొచ్చిందికాదు. ఏనాటినుంచో ఉంది. అవినీతిని నిరో ధించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయి నా ఇందుగలడు అందులేడని సందేహం వలదు అన్నట్లు ఇక్కడా అక్కడా అన్నట్లు కాదు అంతటా వ్యాపించి పోతు న్నది. ఇందువల్ల జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు.

నిరుపేద సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయలు ప్రజా ధనంతో చేపడుతున్న అనేక పథకాలకు తూట్లు పొడు స్తున్నారు. అవినీతి గూర్చి పత్రికా ప్రచార మాధ్యమాల్లో కూడా పెద్దఎత్తునే ప్రచారం అవ్ఞతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా అవినీతిపరులుగా ప్రచారం చేస్తున్నా వారిలో ఏమాత్రం జంకుబొంకు లేకుండా పోతున్నది.లంచాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంకోసం ముఖ్యంగా నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్న పథకాలను తమకు అనుకూలంగా మలుచుకొని డబ్బు సంపాదన కోసం రకర కాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభు త్వం తాజాగా చేపట్టిన భూ రికార్డుల సర్వే కూడా కొన్ని ప్రాంతాల్లో అవినీతి అధికారులకు కల్పతరవ్ఞగా మారింది. వాస్తవంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సర్వేఎంతో అవసరం.

రైతులకు ఉపయోగం కూడా. కానీ దీంట్లో దళారులు ప్రవేశించి కొందరు అవినీతి అధికారులకు ఆదాయవనరుగా మారుస్తున్నారు. మరొకపక్క ఎసిబి అధికారులు నెలల తరబడి వ్యూహాలు పన్ని సమాచారం సేకరించి పట్టుకున్న కేసు ఒక్క కలం పోటుతో అవి కోర్టుకు వెళ్లకుండా అడ్డుకో గలుగుతున్నారు. ఒకటి రెండు కేసులేకాదు. చాలా కేసుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా చిరు ఉద్యో గులు లంచాలు తీసుకొని పట్టుబడిన కేసుల్లో మాత్రం ఏళ్ల తరబడి కోర్టుచుట్టూ తిరుగుతున్నా ఎసిబి కేసులతో ప్రమో షన్లు రాక, ఇంక్రిమెంట్లు పొందలేకపోతున్నారు. కానీ పెద్ద అధికారులు కోట్లాది రూపాయలు అక్రమాస్తులతో పట్టు బడినా కేసుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకుండా పాల కులే అడ్డుపడటం దురదృష్టం. ఎసిబి అధికారులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పట్టుకొని కోర్టుముందు రుజువ్ఞ చేసేందుకు అవసరమైన తిరుగులేని సాక్ష్యాలను, రికార్డుల ను సేకరించి, ఇది ప్రాసిక్యూషన్‌ చేయాల్సిన కేసని స్పష్టంగా రాస్తే దాంతో విజిలెన్స్‌ కమిషన్‌ కూడా ఏకీ భవించినా అందుకు అను మతి ఇవ్వకుండా మోకాలొడ్డి ఎలాంటి చర్యలు లేకుండా వదిలిపెడుతున్నారంటే ఈ అవినీతి ఎలా నిరోధిస్తారో ఊహించుకోవచ్చు.

ఒకటి రెండు కేసులే కాదు. ఉభయ రాష్ట్రాల్లో సంఖ్యాపరంగా పెద్దకేసుల్లోనూ అనుమతి నిరా కరించడమో, పెండింగ్‌లో పెట్టడమో చేసి న్యాయస్థానాల కు వెళ్లకుండా చేయగలుగుతున్నారు. ఎసిబికి చిక్కిన కేసు లు మూసి వేయించడమేకాదు దర్జాగా ప్రమోషన్లు కూడా పొందుతున్నారు.ముఖ్యంగా మున్సిపల్‌ శాఖలో పరిశీలిస్తే ఈ భాగోతం ఏ స్థాయిలో ఉందో బయట పడుతుంది. ఇందువల్ల ప్రభుత్వ ప్రతిష్ట ఎంత దెబ్బతింటుందో ఒక్క సారి పాలకులు ఆలోచించాలి. చేస్తున్న ప్రకటనలు, చెప్తు న్న మాటలు,ఇస్తున్నహామీలు ఏమిటి?అవినీతి విషయంలో జరుగుతున్నదేమిటి? ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమవ్ఞ తుంది. ఒకపక్క వేలాది కోట్లరూపాయల అప్పు తెచ్చుకుం టూ వడ్డీయే వేలకోట్లలో చెల్లిస్తూ కోట్లాది రూపాయలు అవినీతి పాలుచేయడం ఎంతవరకు సమంజసమో పెద్దలు ఆలోచించాలి.ఇప్పటికైనా పాలకులు అవినీతి విషయంలో చెప్పింది చేసేందుకు త్రికరణశుద్ధిగా ప్రయత్నం చేయాలి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌