అవినీతి ఎవరిని ఓడిస్తుందో?

elections222
elections222

అవినీతి ఎవరిని ఓడిస్తుందో?

 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో 70స్థానాలకు ఎన్నికలు జరగ నున్నాయి. బిజెపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి, క్రాంతిదళ్‌, సమాజ్‌వాది పార్టీలు పోటీలో ఉన్నాయి.ప్రధాన పోటీ బిజెపి, కాంగ్రెస్‌, మధ్యనే 2016లో ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి వేసి రాష్ట్రపతిపాలనను ప్రవేశపెట్టడంలో కమల నాధులు వ్యూహం పన్నినట్టు ఆరోపణలు వచ్చి రాజకీయ దుమారం చెలరేగింది. దాంతో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఆ సాను భూతి పవనాలే తమకు విజయావకాశాలని కాంగ్రెస్‌ కలలుకం టోంది. ఈ రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సైన్యంలో పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సర్జికల్‌ దాడులు జరిపించడం వల్ల ప్రజల్లో బిజెపిపై విశ్వాసం పెరిగిందని అలాగే రాష్ట్రంలో మితివిూ రిన అవినీతిని కూకటివేళ్లతో పెకలించడానికి పెద్దనోట్ల రద్దు ప్రయో గం బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఓటర్లలో ప్రభావం చూపించవచ్చు.ఇటీవల కొన్ని సర్వేలు మెజారిటీస్థానాలు బిజెపికే వస్తాయని వెల్లడించాయి.ఇక కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి పరిశీలిస్తే కాంగ్రెస్‌ ఏకైక పార్టీగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఉత్తరా ఖండ్‌ క్రాంతిదళ్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

అయినా బిజెపి తనపని తాను చేస్తూ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే ఎత్తుగడలు పన్నింది. 2016 మార్చిలో 9మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి హరీశ్‌రావత్‌ కు ఎదురుతిరిగి కమలనాధుల వర్గంలో చేరారు. ఫలితంగా కమల నాధులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించేసరికి అసెంబ్లీ లో బలపరీక్ష ఎదురయ్యింది.అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మె ల్యేలకు రావత్‌ ‘ముడుపుల ముసుగు వేస్తున్నారని ఓ వీడియో దుమారాన్ని లేవదీసింది. తరువాత కేంద్రం చొరవ తీసుకుని రాష్ట్ర పతిపాలన విధించేలా పావ్ఞలు కదిపింది. దీనిపై కాంగ్రెస్‌ న్యాయ స్థానాన్ని ఆశ్రయించగా రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ కోర్టు సంచ లనాత్మక తీర్పు వెలువరించింది.

దాంతో కమలనాధుల ఎత్తుగడకు ఆశాభంగం తప్పలేదు. రావత్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవి దక్కిం ది. ఈ రాజకీయ పరిణామాల తరువాత నిర్వహించిన సర్వేలో 2017 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉంటాయని వెల్లడైంది. అయితే ప్రస్తుత సర్వేలు మాత్రం బిజెపికే అనుకూలంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి. కానీ బిజెపిలో అసంతృప్తుల బెడద రానురానూ ఎక్కువవ్ఞతోంది. గత ఏడాది కాంగ్రెస్‌కు ఎవరైతే ఎదురు తిరిగి తమ గూటిలోకి చేరారో ఆ 9 మందికి ఈ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడానికి బిజెపి మొగ్గుచూపుతోంది. ఈ అవకాశవాదాన్ని పార్టీలోని నేతలకు నచ్చడం లేదు. అలా చేస్తే తిరుగుబాటు తప్ప దని వీరు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బిజెపి గెలిస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి అయిదుగురు సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఖండూరి కోడియారి, నిశాంక్‌, బహు గుణలతోపాటు మహారాజా హరక్‌సింగ్‌ తమవర్గం వారికే టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ చిక్కుముడిని విడదీయడానికి బిజెపి ప్రయత్నిస్తోంది.

ఇక కాంగ్రెస్‌ హరీశ్‌రావత్‌ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ రాష్ట్రంలో రాజ్‌పుత్‌ వర్గీయుల ఓటర్లే ఎక్కువ. రావత్‌ ఆ వర్గీయులే అయినందున తమకు గెలుపు అవకా శాలు బాగా ఉన్నాయని నమ్ముతోంది.రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఇక్కడకు పంపించి ఓటర్లను ఆక ట్టుకునే మార్గాలను అన్వేషిస్తోంది.2000 సంవత్సరంలో ఉత్తరా ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినా కాంగ్రెస్‌,బిజెపి,సిగపట్ల కార ణంగా అభివృద్ధి అడుగునపడింది.70స్థానాలున్న అసెంబ్లీకి 2002 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 36స్థానాలు హస్తగతం చేసుకుంది. స్వల్ప మెజార్టీతో అధికారం దక్కించుకుంది. ఎన్‌డితివారీ ముఖ్య మంత్రి కాగలిగారు. 2007లో బిజెపి అతిపెద్ద పార్టీగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 2012లో కాంగ్రెస్‌ ఇతర పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని నెలకొల్పింది. వరదలు ప్రళయంగా ముంచెత్తినప్పుడు సహాయ కార్యక్రమాలు అందించడం లో విఫలం కావడంతో విజ§్‌ుబహుగుణను కాంగ్రెస్‌ తప్పించి రావ త్‌ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. అయితే ఉత్తరాఖండ్‌ ప్రజలు ఏపార్టీ వచ్చినా తమబతుకుల్లో అభివృద్ధి ఉండడం లేదన్న అసంతృ ప్తితో రగులుతున్నారు.

ఉపాధికోసం ఈ రాష్ట్రం నుంచి లక్షలాది మంది వలసపోతున్నారు. పర్యాటకరంగం ఇక్కడ ప్రధాన అంశం అయినప్పటికీ ఆ మేరకు అభివృద్ధి ప్రణా ళికలు అమలు కావడం లేదు. అవినీతి పెచ్చు విూరింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థు లంతా 60 నుంచి 80 ఏళ్ల వయస్సున్న వృద్ధులే తప్ప యువకులు లేరు. ఈ పరిస్థితికి యువజనుల్లో నిరసన వ్యక్తమవ్ఞతోంది. పంజాబ్‌ మాదకద్రవ్యాలకు కేంద్రంగా అప్రతిష్టపాలవ్ఞతున్న పంజాబ్‌లో మొట్టమొదటిసారి ముక్కోణపు పోటీ ఏర్పడింది. గత పదేళ్లుగా ఇక్కడ అకాళీదళ్‌, బిజెపి కూటమి అధికారంలో కొనసాగుతోంది. ప్రధాన పోటీ కాంగ్రెస్సే కానీ ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగడం తో అంచనాలు మారుతున్నాయి. అటు అధికారపక్షం, ఇటు విపక్షం కాంగ్రెస్‌లకు ఆమ్‌ ఆద్మీ పార్టీ కొత్తగా అడ్డుతగులుతోంది. ఆమ్‌ ఆద్మీనేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తన ప్రచారం లో ముఖ్యమంత్రి అభ్యర్ధ్ధి అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుకొని ఓటే యండి అని ప్రచారం చేయడం ఇటు అకాలీదల్‌కు, అటు కాంగ్రెస్‌ కు ఎక్కడా మింగుడు పడడం లేదు. ఓటర్లలో మూడోవంతు మంది దళితులే.వీరు ఆమ్‌ ఆద్మీ పార్టీవైపు మొగ్గుచూపిస్తున్నారు. కాంగ్రెస్‌ కూడా దళితుల ఓట్లపైనే ఆశపెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బాగా ఉన్నందున తామే గెలుస్తామని కాంగ్రెస్‌ నమ్మబలు కుతోంది.

అయితే ఆమ్‌ ఆద్మీ మధ్యలో దూరడంతో ఓట్లు చీలిపోతా యని, దీనివల్ల అకాలీదళ్‌ మళ్లీ పగ్గాలు పట్టడానికి మార్గాలు ఏర్పడతాయని కాంగ్రెస్‌ సందేహిస్తోంది. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ అభ్యర్థుల్లో స్థానికేతరులు ఎక్కువగా ఉన్నారు. ఆమ్‌ ఆద్మీ అధికా రంలోకి వస్తే సట్లెజ్‌-యమున కాలువ ద్వారా ఢిల్లీకి ఆమ్‌ ఆద్మీ నీటిని తరలించుకుపోతుందని అకాలీదళ్‌ ఆరోపిస్తోంది. దీన్నే ప్రజ ల్లో ప్రచారం చేసి ఆమ్‌ ఆద్మీ అడ్రసు లేకుండా చేయాలని అకాలీ దళ్‌ రాజకీయ పన్నాగం. రెండేళ్ల క్రితం అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా ఆమ్‌ ఆద్మీ నాలుగు ఎంపి స్థానాలను సాధించగలిగింది. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక్కడ బలంగానే ఉంది.

యువకుల్లో 40 శాతం మంది కేజ్రీవాల్‌పైనే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కుటుంబీకులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం బాగోగులు కన్నా వ్యాపారాలే ముఖ్యమన్న ధోర ణిలో బాదల్‌ కుటుంబం వ్యవహరిస్తోందని, మాదక ద్రవ్య ముఠా లకు అండదండలు అందిస్తున్నారన్న అపవాదు ప్రచారంలో ఉంది. ఇదెంతవరకు వాస్తవమో చెప్పలేం. కానీ మాదకద్రవ్యాల మత్తులో పడి యువత చిత్తవ్ఞతోంది. ఎందరో ప్రణాలు కోల్పోయారు. ఈ ‘పాపం పాలకవర్గానిదేనని ఓటర్లు ఆరోపిస్తున్నారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రం పంజాబ్‌ అని పాలకవర్గం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో వాస్తవాలుమరోలా ఉన్నాయి. ఇదొక్కటే సమస్యకాదు.

దేశం మొత్తం మీద వ్యవసాయరంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య అధికంగా ఉంది. ఆత్మ హత్యల్లో గత ఏడాది మహారాష్ట్ర తరువాత పంజాబే స్థానం వహిం చింది. రుణభారం, నకిలీ పురుగుమందులు, విత్తనాలు పంటవైఫ ల్యాలు రైతుల బతుకులను మట్టిపాలుజేస్తున్నాయి.అకాలీలకు బల మైన ఓటు బ్యాంకుగా ఉన్న గ్రామీణ జాట్‌-సిక్కు రైతులు పాలక వర్గంపై నిప్పులు చెలరేగుతున్నారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానా ల్లో 69స్థానాలున్న మాల్వా ప్రాంతంలో ఇది కీలకాంశం. ఈ ప్రాం తం నుంచే నాలుగు ఎంపిస్థానాలను ఆమ్‌ ఆద్మీ దక్కించుకుంది. తాము అధికారంలోకి వస్తే రుణాల నుంచి విముక్తి కలిగిస్తామని కాంగ్రెస్‌పార్టీ రైతులకు భరోసా కల్పిస్తోంది. ఇప్పటి నుంచే పత్రాలు నింపిస్తోంది. ఇదేవిధంగా ఆమ్‌ ఆద్మీపార్టీ కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యవసాయ మేనిఫెస్టోను విడుదల చేసింది. డ్రగ్స్‌ ముఠానాయకుల ను జైళ్లలో పెట్టిస్తామని హామీ ఇస్తోంది. వ్యవసాయ మేనిఫెస్టో విధంగానే దళితుల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించింది. మరి పంజాబ్‌ యువతరం ఎటువైపు మొగ్గుతుందో చూడాలి.

పి.వి.ఆర్‌.మూర్తి