అవినీతిలో ఇరు పార్టీలు దొందూ దొందే..

న్యూఢిల్లీ: అవినీతిలో బిజెపి, టిఎంసి దొందూ దొందేనని సీపిఐ సీనియర్ నేత సీతారాం ఏచూరి విమర్శించారు. వరుస ట్వీట్లలో రెండు పార్టీల తీరును ఎండగట్టారు. బిజెపి అవినీతి కేసుల చిట్టా చాలా పెద్దదని, జిఎస్పిసిఎల్ స్కామ్ నుంచి వ్యాపం, సహారా-బిర్లా డెయిరీస్, రైస్ , నీరవ్ మోది, మైనింగ్, లెక్కకు మించిన ఇతర కేసులున్నాయాన్నారు. రాఫెల్ కేసులో అవినీతి అందరికీ తెలిసిందేనని చురకలు వేశారు. జేపిసి వేయడానికి బిజెపి వాళ్లు నిరాకరించినప్పుడే రాఫెల్ స్కామ్‌లో వాళ్ల ప్రమేయం రుజువైందని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న బిజెపి…రాఫెల్ స్కామ్‌పై ఎందుకు దర్యాప్తునకు ఆదేశించడం లేదని సీతారాం ఏచూరి నిలదీశారు.
ప్రజలను లూటి చేయడంలో తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నామకత్వంపై కూడా తప్పనిసరిగా విచారణ జరపాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పలువురు టిఎంసి ఎంపీలు ఇప్పటికే అరెస్టులు, చార్జిషీట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు.