అవినీతిని ప్ర‌శ్నించినందుకే వేటు

Kodela Suryalatha
Kodela Suryalatha

విజయవాడ: కనకదుర్గమ్మ ఆలయంలో కొంతమంది సిబ్బంది అవినీతికి అడ్డు తగులుతున్నందునే తనపై చీర దొంగ ముద్ర వేశారని దుర్గగుడి పాలకమండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత ఆరోపించారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో శ‌నివారం సూర్యలత మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలకమండలి సభ్యురాలిగా అమ్మవారికి సేవ చేస్తున్న తనపై కొంతమంది కావాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. అమ్మవారి ఆలయంలో అన్ని పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో సేవలన్నింటినీ కంప్యూటరీకరణ చేయాలనీ పాలకమండలికి తాను సూచించినట్లు చెప్పారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఈవో దృష్టికి తీసుకెళ్లినందునే కొందరు తనపై కక్ష సాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయతీని నిరూపించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు.