అవినీతిని తిరిమికొడదాం

ప్రజావాక్కు

            అవినీతిని తిరిమికొడదాం

Corruption
Corruption

అవినీతిని తిరిమికొడదాం
భారతదేశంలో అవినీతి, అక్రమాలు విలయతాండవం చేస్తు న్నాయి.ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇటీవల ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ వెల్లడించిన నివేదికలో భారత్‌ మరింత అవినీతిగల దేశాలలో ముందంజలో ఉందని తెలిసింది. అవినీతి అభివృద్ధిని కబలిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అధికారుల హవా కొనసాగుతుంది. రెవెన్యూ రిజిస్ట్రార్‌ శాఖలలో అవినీతి అధికంగా జరుగుతున్నట్లు సర్వేలో వెల్ల డైంది.గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు. సాదా బైనా మానుండి భూముల క్రమబద్ధీకరణలో అవినీతికి పాల్పడవద్దని ప్రభుత్వంఆదేశాలు జారీచేసినా అవేమిపట్టించుకోకుండా బాహా టంగానే జనాల నుంచి జలగల్లా డబ్బులు గుంజుతున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి గూర్చి అందరికీ విదితమే. వివిధ శాఖల అధికారులు కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవి తాన్ని గడుపుతున్నారు.అవినీతి అధికారులను సర్వీస్‌ నుండి తొలగించాలి. కఠినంగా శిక్షించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, జయశంకర్‌జిల్లా

అకడమిక్‌ కేలండర్‌ అవసరం
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు కూడా నిరుద్యోగుల ఉపయోగార్థం నిర్ణీత వ్యవధిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అకడమిక్‌ కేలం డర్‌ని రూపొందించాలి. నోటిఫికేషన్లు వెలువడటానికి, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చాలా సమయం పట్టడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవ్ఞతున్నారు. వారు ఆర్థిక భారంతో సతమ తమవ్ఞతున్నారు. నోటిఫికేషన్స్‌కు ముందే న్యాయపరమైన చిక్కులని పరిష్కరిస్తే, ఉద్యోగాల భర్తీలో జాప్యం లేకుండా ఉంటుంది. మరోవైపు వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యో గులపై తీవ్ర పనిభారం పడుతుంది.
-ఎం.రాంప్రదీప్‌,హైదరాబాద్‌

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి
ప్రతిహిందూ దేవాలయానికి హిందూమతం పరిరక్షణ కమిటీఉండాలి.మతమార్పిడులుబలవంతంగా చేయరాదు. మతం మార్చుకున్నవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ (ఉచి తంగా) చేసుకోవాలి. అన్నిమతాలు ఒక్కటే అనేభావంతో ఉండాలి.ఏమతం మార్చుకున్నా మనిషి అన్నవాడు మంచి మనిషిగా బతుకుతేనే ఆ బతుకుకు అర్థం ఉంటుంది.
-వి.వివేక్‌,విశాఖజిల్లా

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక సమస్యలు న్నాయి. వాటన్నింటిని రాజకీయ పార్టీలు గాలికి వదిలేసి ఒక రిమీద ఒకరు బురదచల్లుకోవడంతో ప్రజలు విసిగెత్తిపోతున్నా రు. రాష్ట్రంలోని నాయకులందరూ సమర్థులే కాదనలేం. కానీ, ఎవరి సమర్థత ఎంతో ప్రజలకు తెలుసు. రాష్ట్ర విభజన జరి గాకఈ నాలుగేళ్లలో కష్టనష్టాలను అధికమిస్తూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధేకాదని విషప్రచారం చేయడం కూడా మంచి పద్ధతికాదు. రాష్ట్ర విభజన చేసిన గాయం ఇంకా మానలేదు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు సహకరించడంతో రాష్ట్రం వాస్తవ రూపంలోకి ఇప్పుడిప్పుడే రావడం మొదలయింది.
-కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

అసమానతలు ఉన్నంతకాలం..
సభ్యసమాజానికి పరువ్ఞహత్యలు మచ్చగా మారుతున్నాయి. ఇష్టంలేని వివాహం చేసుకుందని కన్నకూతురినే చంపారు. సమాజంలో కుల అసమానతలు ఉన్నంత వరకు ఇలాంటి హత్యలు అనేక రూపాల్లో జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక సామాజిక సమస్య. ఇలాంటి పెడపోకడలు సమాజంలో ప్రబల కుండా నిలువరించాలంటే మూలాల వద్దే పరిష్కారాలు కనుగొ నాలి. భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్న స్ఫూర్తిని ప్రతిపౌరుడు నరనరాన జీర్ణించు కున్నప్పుడే కుల నిర్మూలన సాకారమవ్ఞతుంది. ఇలాంటి హత్యల దురాగతాలకు తెరపడుతుంది.
-వ్ఞలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

బంగ్లాదేశ్‌తో స్నేహసంబంధాలు
బంగ్లాదేశ్‌ ఎన్నికలలో వరసగా మూడోసారి విజయం సా ధించి షేక్‌హసీనా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీ ఆదేశంతో సత్సంబంధాలను బలో పేతం చేసే దిశగా పలుచర్యలు చేపట్టడం హర్షణీయం. దక్షిణాసియాలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డు కునేందుకు భారత్‌కు బంగ్లా మద్దతు తప్పనిసరి. ఒకవైపు భారత్‌,బంగ్లాలమధ్య స్నేహసంబంధాలు గట్టిపడుతున్నా యి. వాణిజ్య సంబంధాలలో చైనా బంగ్లాతో అగ్రస్థానంలో ఉంది. బంగాళాఖాతలంఓ చైనా తన ప్రాబల్యం పెంచుకు నేందుకు భారత్‌తో మిగతా దేశాల మధ్య ఉన్న సంబంధా లనుపాడు చేసేందుకుప్రయత్నిస్తోంది. అందుకే బంగ్లాదేశ్‌ లో భారత్‌ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
– సి.ప్రతాప్‌, శ్రీకాకుళం