అవలీలగా చేసి పారేసింది.

ఐడిల్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారుగా.. అలాగా ఎదో ఒకటి చేస్తుంటారు. వాళ్ళందరూ సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తుంటారు. వాళ్ళను ఎవరో ఒకరు ఎంటర్టైన్ చెయ్యాలిగా. వాళ్ళను ఫుల్ గా ఎంటర్టైన్ చేసే జనాల లిస్టు లో కి కికి బ్యూటీ అదా శర్మ చేరింది.సూపర్ హిట్ అయిన హర్రర్ సినిమా ‘ఎగ్జార్సిస్ట్’ లో స్పైడర్ వాక్ సీన్ ఉంటుంది. అంటే సాలెపురుగు టైపులో మనం చేతులను కాళ్ళలా చేసి ‘నాలుగు కాళ్ళ’తో ఉల్టా పల్టాగా నడవాలి. అదేమీ అంత సులువైన పని కాదు.. ఫుల్ గా ఫిట్నెస్ లేకపొతే నడుము ఇరగడం ఖాయం. మరి ఈ అదామాత్రం దాన్ని అవలీలగా చేసి పారేసింది. ఆమె ప్రస్తుతం ‘కమాండో 3’ షూటింగ్ కోసం లండన్ లో ఉంది. మరి ఆ సినిమా కోసమే ఈ 1920 స్టైల్ ఫాలో అవుతున్నానని ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసి మరీ తెలిపింది.