అవయవదానం చేసిన సీనియర్ పాత్రికేయుడు అద్దంకి నాగేశ్వరరావు
హైదరాబాద్ : సీనియర్ పాత్రికేయులు అద్దంకి నాగేశ్వరరావు(58) కొద్ది రోజుల క్రితం అస్వస్ధతకు గురై మలక్‌పేట యశోధ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావును పలువురు ప్రముఖులు, పత్రిక విలేకరులు, నాయకులు పరమర్శించారు. నాగేశ్వరరావుకు బ్రెయిన్ హమరేజ్ అవడంతో ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయిందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. దీంతో కుటుంబసబ్యులు అవయావ దానం చేయడానికి ముందుకు వచ్చారు. నాగేశ్వరరావు కిడ్నిలు, లీవర్స్, నేత్రాలను దానం చేశారు. జీవన్‌దాన్ ట్రస్టు అవయావాలను తీసుకోవడం జరిగిందని, ఒక కిడ్నిని కిమ్స్ అసుపత్రికి, మరోకిడ్నిని నిమ్స్‌కు, లీవర్ను సికింద్రాబాద్ యశోధ ఆసుపత్రికి, కళ్లను ఎల్వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు తరలించనున్నట్లు ఆసుపత్రి జనరల్ మేనేజర్ జి.రాంరెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాల కాలం నుంచి అద్దంకి నాగేశ్వరరావు వివిధ పత్రికలలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో పాటు పిటిటియు రాష్ట్ర నాయకులుగా విధులు నిర్వహిస్తున్నరని బందువు మారుతిరావు పేర్కొన్నారు. అద్దంకి నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.