అలీఘ‌డ్ క్యాంప‌స్‌లో ఉద్రిక్త‌త

ALIGARH CAMPUS
ALIGARH CAMPUS

అలీఘ‌డ్ః జిన్నా చిత్రపటం వివాదంతో యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఏఎంయూ) అట్టుడుకుతోంది. వందలాది విద్యార్థులు నిరసలకు దిగడం, ఐదు రోజుల పాటు క్లాస్‌లను బహిష్కరించాలని నిర్ణయించడంతో క్యాంపస్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దశాబ్దాలుగా స్డూడెంట్ యూనియన్ కార్యాలయంలో ఉన్న జిన్నా చిత్రపటం ఈ వివాదానికి కేంద్రబిందువైంది. చరిత్రలో భాగమైన జిన్నా పటాన్ని తొలగించేందుకు తాము ఎంతమాత్రం సుముఖంగా లేమని విద్యార్థులు చెబుతున్నారు. అలీగఢ్ ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా క్యాంపస్ వెలుపల ఐదు కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ (ఆర్ఏఎఫ్)ను రంగంలోకి దింపారు. శనివారం రాత్రి 12 గంటల వరకూ అలీగఢ్ జిలాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు.