అలా పేర్కొన లేదు: మాక్స్‌వెల్‌

MAX WELL
సిడ్నీ : భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీపై తాను చేసినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ స్పష్టం చేశాడు.కాన్‌బెర్రాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేయడానికి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌లో వేగం తగ్గించడాన్ని మాక్స్‌ వెల్‌ అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై మాక్స్‌వెల్‌ మండిపడ్డాడు. బ్యాటింగ్‌లో ఎవరూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని తనను అడిగితే ఆ సమయంలో విరాట్‌ కోహ్లీ కన్నా ఉత్తమంగా బంతిన కొడుతున్న వారు లేరని తాను అనుకుంటున్నట్లు చెప్పానని ఆయన వివరణ ఇచ్చాడు.