అలాంటి ప్రయోగాలు చేయలేను

KEERTI SURESH-
KEERTI SURESH-

అలాంటి ప్రయోగాలు చేయలేను

ఏ హీరోయిన్‌ అయినా.. సినిమా కోసమైనా సరే లావుగా అవ్వటానికి మాక్సీమం ఒప్పుకోరు. ముఖ్యంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లు అయితే ఎంత మాత్రం ఒప్పుకోరు. రీసెంట్‌గా క్యూట్‌ హీరోయిన్‌ కీర్తిసురేష్‌ని కూడ లావుగా అవ్వాలని ఓ దర్శకుడు చెప్పారట.. కానీ అమ్మడు స్వీట్‌గా నో చెప్పేసిందని తెలుస్తోంది. సావిత్రి బయోపిక్‌ మహానటికి డైరెక్టు చేస్తున్న నాగ్‌ అశ్విన ..మహానటిలో కీర్తిసురేష్‌ సావిత్రి పాత్రలో కన్పించబోతున్న సంగతి తెలిసిందే.. అయితే సావిత్రి పెళ్లి తర్వాత కెరీర్‌ డీలా పడినపుడు కాస్తలావుగా కన్పిస్తారు.. అలాంటి ఎపిసోడ్స్‌ సీన్స్‌ కోసమని దర్శకుడు కీర్తిని లావు అవ్వమని కోరగా, లావయితే అవకాశాలు రావు కదా అని నో చెప్పేసిందట.. ఈయితే ఈ సినిమాలో కీర్తి దాదాపు 150 రకాల కాస్ట్యూమ్స్‌ ధరించిందట.. ప్రస్తుతం ఆ సినిమాపై మంచి అంచనాలున్నాయి.. సినిమా పాటలకు కూడ ఆదరణ బాగానే వస్తోంది..