అర్హతలున్న ఎవరైనా దేవాలయాల్లో అర్చకులే!

UTTARAKHAND
UTTARAKHAND

డెహ్రాడూన్‌: కేవలంఅగ్రవర్ణాలకు చెందిన పూజారులు మాత్రమే దేవాలయాల్లో పూజాధికాలకు అర్హులనడం రికాదని, తక్కువ కులాలకు చెందినవారుసైతం ఈ పూజలుచేయవచ్చని ఉత్తరాఖండ్‌ హైకోర్టు స్పష్టంచేసింది. ఇతర కులాలకు చెందిన అభ్యర్ధులు పూజారులు, అర్చకులుగా ఉండకూడదన్న నిబంధనలేమీ లేవని కోర్టు స్పష్టంచేసింది. అగ్రవర్ణ పూజారులు తక్కువ కులాలకు చెందినవారని వారిని పూజాధికాలనిర్వహణకు తిరస్కరించడానికి లేదని, ఎస్‌సిఎస్టీ కులాలకు చెందినారైనంతమాత్రాన అభ్యంతరపెట్టకూడదన్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం మొత్తం అగ్రవర్ణాలకు చెందిన పూజారులు ఇతర కులాలవారిని పూజాధికాల నిర్వహణను కొనసాగించాలని, ఆధ్యాత్మికకార్యక్రమాలైన పూజా లేదా వివిధ అర్చనలు చేసుకోవచ్చని, తక్కువ కులాలకు చెందిన సభ్యులతరపున పూజాధికాలుసైతం నిర్వహించవచ్చని రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలుచేయాలని హైకోర్టు డివిజన్‌బెంచ్‌ జస్టిస్‌ రాజీవ్‌శర్మ, జస్టిస్‌ లోక్‌పాల్‌సింగ్‌లు ఆదేశించారు. అన్ని కులాలకు చెందినవారిని దేవాలయంలోనికిఅనుమతించాలని, ఉత్తరాఖండ్‌మొత్తంగా ఎలాంటి వివక్షచూపించకూడదని పేర్కొంది. ఇతర కులాలకు చెందినవారుసైతం పూజారులుగా పనిచేయవచ్చని సరైన శిక్షణ, అర్హత కలిగిన అభ్యర్ధులు పూజారిగా కులాలకు అతీతంగా పనిచేయవచ్చన్నారు. 2016లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై డివిజన్‌ బెంచ్‌ విచారణచేపట్టింది. ఎస్‌సి ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు దాఖలుచేసిన ఈ పిటిషన్‌ విచారించిన కోర్టు ఆదేశాలు జారీచేసింది. హరిద్వార్‌లోని హర్‌కీ పౌరిలో ఈ పూజార్ల వివాదంపై సుదీర్ఘ విచారణజరిపింది. ధర్మశాలలో ఒక బీరువాను సమీపంలోని సంత్‌ర విదాస్‌ మందిరంవద్దకు తరలించేందుకు నిర్ణయించారు. అయితే ఈచర్యను అగ్రవర్ణసభ్యులు తిరస్కరించారు. దీనివల్ల యాత్రీకుల రాకపై ప్రభావంచూపిస్తుంద్నారు. హైకోర్టు ఈ సమస్యను వారిలోనే పరిష్కరించుకోవాలనిసూచించింది. గతనెల 15వ తేదీ వెలువరించిన ఈ తీర్పులో పూజార్ల అర్చనలు,పూజాధికాలకు సంబంధించి మాత్రమే నిబంధనలు రూపొందించింది.