అరెస్టుపై హైకోర్టు సీరియస్‌

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి అరెస్టుపై హైకొర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలు లేకుండా ఆయనను ఎలా అరెస్టు చేశారని పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. అల్లర్లు జరగవచ్చన్న ఇంటిలిజెన్స నివేదికతో అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా ,ఐతే ఆ ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ నిమిత్తం నివేదికను మరికొద్దిసేపట్లో కోర్టులో పరిశీలిస్తారు.