అరుణగ్రహం!

IMG1
IMG

అరుణగ్రహం!

24 లక్షల మంది ఆసక్తి
వారిలో 1.3 లక్షల భారతీయులు
ఇన్‌సైట్‌ లాండర్‌పై పేర్ల స్టిక్కర్‌

వార్త సైన్స్‌డెస్క్‌: ప్రపంచంలో లక్షలాది మంది అరుణ గ్రహంపై ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కుజుడిపై జీవరాశి ఉండే అవకాశం ఉందని.. అక్కడ మానవ్ఞడు నివసించేందుకు అనువ్ఞగా ఒక్కప్పుడు నీరు, తగిన వాతావరణం ఉండేదని ఇటీవల నాసా ఓ నిర్థారణకు వచ్చింది. అందుకే మరిన్ని ఉపగ్రహాలను రెడ్‌ప్లానెట్‌పైకి గురిపెట్టింది.మన ఇస్రో కూడా మామ్‌,మంగళ్‌యాన్‌ పేరిట మార్స్‌పై పరిశోధనలలో చేతులు కలుపుతోంది కూడా. ఇటీవల నాసా ఇన్‌సైట్‌ పేరిట ఓ కొత్త మిషన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కుజుడిపై ఆసక్తి చూపేవారందరి పేర్లను ఓ సిలికాన్‌ చిప్‌పై వెంట్రుక వాసిలో వెయ్యోవంతు పరిమాణంలో చెక్కి, ఉపగ్రహంతో బాటు పంపి కుజుడిపై జారవిడిస్తారట. ఇహ వారిపేర్లు ఆ లాండర్‌తో బాటు అక్కడే శాశ్వతంగా ఉంటాయన్నమాట. సువర్ణాక్షరాలతో లిఖిస్తాం అంటారు చూడండీ…

అలాంటి అరుణాక్షరాలు అన్నమాట! ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే… 24లక్షలకు పైగా వచ్చాయట. అందులో మన భారతీయుల నుండి 1.30లక్షల మందికి పైగా వచ్చాయట.ి వరుసలో 6.7లక్షల మందితో అమెరికా మొదట స్థానంలో,2.62లక్షల మందితో చైనా రెండవ స్థానంలో ఉండగా భారత్‌ది మూడవ ప్లేస్‌