అరుంధతి

                     అరుంధతి

ARUNDHATI
ARUNDHATI

అరుంధతి సప్తఋషులలో ఒకరైన వశిష్టమహర్షి ధర్మపత్ని. పాతివ్రత్యానికి సంబంధించి ఆమె ప్రధమ గణ్యురాలు. నేటియువతీ యువకులు కూడా అరుంధతి పేరును గుర్తించ గలిగేలా హిందూ వివాహతంతులో ఓ ప్రక్రియ వ్ఞంది. సప్తపది ముగిసిన అనంతరం వరుడు,వధువ్ఞకు ఆకాశంలో వశిష్టమహ ర్షితో వ్ఞన్నా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అరుంధతి నక్షత్రపు కాంతి అతి బలహీనంగా వ్ఞండే కారాణంగా ఆ నక్షత్రంచాలా మంది చూడగలిగే అవకాశం లేదు. అయినప్పటికీ వధువ్ఞ నక్షత్రం కనబడలేదని చెప్పట్టం అమంగళకరంగా భావిస్తారు. అలా కనబడని వారికి అపమృత్యువ్ఞ సమిపిస్తుందని ఓ వింత నమ్మకం వ్యాప్తిలోవ్ఞంది. అరుధంతి వశిష్టమహర్షిని సేవించి తరించి ఆయన్ను భర్తగా పొందిన కారణంగా భార్యభర్తల అన్యోన్యదాంపత్య సిద్దికి భార్య సుమంగళీత్వానికి అరుం ధతి నక్షత్ర దర్శనం చేసుకుంటారు.

నవదంపతులు భర్తతో అనుకూలదాంపత్యం వారికి అనుగ్రహింపబడుతుందని విశ్వసిస్తారు. ఆమె ఓ చండాలకన్య. వశిష్టుడు కొనసాగించిన వేయి సంవత్సరాల తపోధీక్షా కాలంలో ఆమెకు మహర్షికి సేవ చేసే భాగ్యం లభిస్తుంది. ఆమె అకుంఠిత సేవతో సంప్రీతుడయిన వశిష్టుడు ఏదైనా వరం కోరుకోమప్నప్పుడు, ఆమె ఆయన్ను భర్తగా పొందు వరాన్ని కోరింది. తను బ్రహ్మణ కులమునకు చెందివ్ఞండగా, అరుంధతి ఛండాల కన్యగా ఎట్లు దాంపత్యము పొసగు తుందని ప్రశించినప్పటికీ ఆమె తన కోరిక విడనాడ లేదు. అప్పుడు మహర్షి తన తపో శక్తితో ఆమెను ఏడుసార్లు బూడిదగా మార్చి తిరిగిబ్రతికిస్తూ ఏడు జన్మలో ఛండాల దోషాన్ని పరిహారం చేశాడనీ ఆ తరువాత ఆమెకు బ్రహ్మణత్వం సిద్ధించగా వివాహమాడాడని కథప్రచారంలో ఉంది. అరుంధతి కర్థమ ప్రజాపతి, దేవహూతిలకు జన్మించిన ఎనిమిదవ సంతానం.

పరాశరునికి మాతామహింగా, వ్యాసభగవనునికి ముత్తవ్వగా అరుంధతి చెప్పబడింది పూర్వజన్మలో ఆమెకు బ్రహ్మమానస పుత్రిక అయిన సంధ్యగా చెబుతారు. ఆమె సప్తఋషులకు త్తత్వబోధచేస్తు వేదశాస్త్ర పురాణీతిహాసాలను వివరిస్తు వ్ఞండేదని ప్రతీతి. శ్రీమద్రా మాయణం ప్రకారం ఆమె నూరుగురు కుమారులను విశ్వామిత్రుడు నిహతులయ్యే విధంగా శపించినప్పటికీ ఆమె సహనం చూపించి.సప్త రుష్లు యాగం నిర్వహిస్తున్నప్పుడు అగ్నిదేవ్ఞడు వారి భార్యలను చూసి మోహించిన సందర్భంలో అగ్నిదేవ్ఞని భార్యఅయిన స్వాహాదేవి సప్తఋసులలోని ఆరుగురి భార్యల రూపాలను తానుధరించి భర్తను సంతోషపెట్టింద ని,కాని వశిష్టుని భార్య అయిన అరుంధతి రూపం మాత్రం ఆమె ధరించలేక పోయిందని పురాణ కతనం.విశ్వామిత్రుడు వశిష్టాశ్రమంలో ఉన్న కామధేనువ్ఞ పై మోజుపడి స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేసినప్పుడు, ఆకామధేనువ్ఞ మహిమచేత అనంతంగా సైన్యం పట్టుకొచ్చి విశ్వామి త్రుని సకల సేవలను మట్టికరిపిస్తుంది.

ఆ సందర్బంగా పగబూని అరుంధతి వశిష్టుల నూరుగురి సంతానాన్ని శాపంతో వధిస్తాడు. అయినప్పటికీ ఆ దంపతులు విశ్వామిత్రుని క్షమిస్తారు. ఆక్షమకు ఫలితంగా, వారికి శక్తి అను కుమారుడు ఉద్భవిస్తాడు. ఆ శక్తిని కూడా విశ్వామిత్రుడు సంహరిస్తాడు. వ్యాకులపడిన దంపతులు వానప్రస్థాశ్ర మ స్వీకరణకు ఉద్యుక్తులయినప్పుడు బ్రహ్మ వలదనీ శ్రీరామదర్శనం వారికిత్వరలో లభించనున్నాదనీ చెబుతారు. లక్ష్మనారాయణ స్వరూపు లయిన సీతారాములఅరణ్యవాసకాలంలో వారు వశిష్ట్టాశ్రమాన్ని సందర్శించి నపుడు, సీతామాతకు అరుంధతి పతివ్రతా ధర్మబోధ చేస్తుంది. అంతటి ప్రజ్ఞాశాలిగా, మహాపతివ్రతగాఆమె సప్తర్షినక్షత్ర మండలంలో వశిష్టనక్షత్రానికి అతి సమీపంలో ఓ తారగా ప్రకాశిస్తోంది.
– ఉలాపు బాలకేశవ్ఞలు