అరవైలో ఆరోగ్య నియమాలు

Untitled-1 copyఅరవైలో ఆరోగ్య నియమాలు

తన ఆయుర్దాయం ఎంత అన్నది ఏ వ్యక్తికీ తెలియదు. అయితే బ్రతికినంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలని, ఎవరిచేత చేయించుకోకుండా సాధ్యమైనంత ఎక్కువకాలం బ్రతకాలనే ఆశ ప్రతివ్యక్తికీ ఉంటుంది. అందుకే పెద్దలు దీవించేటప్పుడు దీర్ఘాయుష్మాన్‌ భవ అని దీవిస్తుంటారు. అదే సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తనువ్ఞ చాలించాలని మాత్రం ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. ఇది అందరికీ సాధ్యపడుతుందా అంటే సమాధానం మన దగ్గర ఉండదు. అయినా మనిషి ఆశాజీవి కనుక, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి మనిషీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆధునిక వైద్య విజ్ఞానం ప్రభావం, ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగటం తదితర కారణాల వలన పలుదేశాలలో ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. దానితోబాటు వృద్ధుల శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఒకానొక నివేదిక ప్రకారం ప్రస్తుత చైనా జనాభా 120కోట్లలో మూడువంతులు పైగా 60సంవత్సరాలు దాటినవారే. అదే సమయంలో ఆహారమే అద్భుతమైన, అన్నింటికన్న శక్తివంతమైన మందు అని అన్ని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 50-60 సంవత్సరాల వయసు దాటినవారు, ఆరోగ్యంగా ఉంటూ ఆయుర్దాయం పెంచుకోవటానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో సంక్షిప్తంగా తెలుసుకుందాం. వయసుపైబడే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. ఆకలి మందగిస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉండదు. శక్తి క్రమేపీ క్షీణించటం ప్రారంభిస్తుంది. క్రొత్త కణాల ఉత్పత్తి వేగం తగ్గి, ఉన్న కణాలు శిథిలం కావటం వేగవంతమవ్ఞతుంది. రోగనిరోధక శక్తి మందగించటంతో అప్పటివరకు అణిగి ఉన్న వ్యాధులు, వంశపారం పర్య దీర్ఘవ్యాధులు మెల్లమెల్లగా బయటపడుతుంటాయి. ఇటువంటి పరిస్థితులలో వృద్ధులు తమ జీవనశైలిని, ఆహార నియమాలను మార్చుకోవలసి ఉంటుంది.

ఆ క్రమంలో… ౖ వయసు మీద పడటంతో దాహం వేయదు. అయినా క్రమం తప్పకుండా ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీరు తీసుకోవాలి. ఇందువలన పోషకాలన్నీ శరీరంలోని అన్ని భాగాలకు చేరతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా నిలకడగా ఉంచబడుతుంది. ౖ త్వరగా జీర్ణమయ్యే బలవర్థకమైన ఆహారపదార్ధాలను మాత్రమే భుజించాలి. ౖ ఎముకలు దృఢంగా ఉండాలి గనుక సాధారణం కన్నా ఎక్కువగా సున్నం అవసరమవ్ఞతుంది. ఆ సున్నం శరీరానికి వంట బట్టాలంటే విటమిన్‌-డి అవసరం. అందువలన విటమిన్‌-డి, సున్నం పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను కొరత లేకుండా తీసుకోవాలి. ౖ వృద్ధాప్యంలో రోగనిరోధకశక్తి తగ్గకుండా తగు జాగ్రత్త వహించాలి. రోగనిరోధకశక్తిని పెంచే శక్తి ఒక్క ‘జింక్‌ లోహానికే ఉన్నది. అందువలన జింక్‌లోహం ఎక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక చేసి తీసుకోవాలి. ౖ నాడీవ్యవస్థ సక్రమంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి విటమిన్‌’బి-12 అవసరం. కనుక ఆ విటమిన్‌ పుష్కలంగా ఉండే ఆహారం అవసరం. వీటితో బాటు మలబద్దకాన్ని నివారించే పీచుపదార్థాలతో కూడి ఆహారాన్ని, ఇంకా ఫోలిక్‌ఆసిడ్‌, విటమిన్‌-బి సమృద్ధిగా ఉండే ఆహారమూ కావలసి ఉంటుంది.