అరకు రోడ్‌ లో విడుదలకు సిద్ధం!

ARAKU ROAD LO111
ARAKU ROAD LO

అరకురోడ్‌ లో …విడుదలకు సిద్ధం!

రాం శంకర్‌, నికిషా పటేల్‌ జంటగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం అరకు రోడ్‌ లో. వాసుదేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్‌, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలన్ని పూర్తి చేసుకుని డిసెంబర్‌ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఖికరెన్సీ సమస్య ఉన్నా సినిమాపై నమ్మకంతో సినిమాను ధైర్యంగా డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. నిర్మాతలుగా మాకు మంచి బ్రేక్‌ నిచ్చే చిత్రమవుతుంది. సాయిరాం శంకర్‌ గారి అమ్మాయి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో చక్కగా నటించింది. సాయిరాం కెరీర్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చే చిత్రమవుతుందని నమ్మకంగా ఉన్నాం అన్నారు. డైరెక్టర్‌ వాసుదేవ్‌ మాట్లాడుతూ.. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌గారు సినిమాను చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. రాహుల్‌ రాజ్‌ మంచి సంగీతానందించారు. మణిశర్మగారి తనయుడు ఈసినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను అందించారు అన్నారు. సాయిరాంశంకర్‌ మాట్లాడుతూ.. సినిమా బాగా ఆడాలంటే సినిమాలోని కంటెంట్‌తో పాటు ప్రమోషన్స్‌, థియేటర్స్‌ అన్నీ అవసరం ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి. కామెడి, యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ. వైజాగ్‌-అరకు ప్రాంతాల్లో నడిచే కథ. మంచి ఎమోషన్స్‌ ఉన్న సినిమా అన్నారు.