అరంగేట్ర టెస్టులో ఎక్కువ పరుగులు చేసిన రెండో ఓపెనర్‌ ‌

MAYANK AGARWAL
MAYANK AGARWAL

మెల్‌బోర్న్‌: టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ అరంగేట్ర టెస్టులో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతూ జాతీయ జట్టుకు ఆడాలన్న కలను నిజం చేసుకున్న మయాంక్‌ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల విలువైన పరుగులు చేసిన మయాంక్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక పరుగులే చేశాడు.  దీంతో విదేశీ గడ్డపై తొలి టెస్టులో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో మయాంక్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇతడి కంటే ముందు గావస్కర్‌ 132 పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నారు. 118 పరుగులతో అగర్వాల్‌ రెండోస్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో  ఎల్‌ఎస్‌ రాజ్‌పుత్‌ (93 పరుగులు), ఎస్‌ఎస్‌ నాయక్‌ (81 పరుగులు), ఎంహెచ్‌ మంకడ్‌ (77 పరుగులు) ఉన్నారు.