అయోధ్య తుది విచార‌ణ వాయిదా!

supreem court
supreem court

ఢిల్లీః అయోధ్య వివాదంపై తుది విచారణ వాయిదా వేస్త‌న్న‌ట్లు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్,
జస్టిన్ అబ్దుల్ నజీర్ తో కూడిన ధర్మాసనం తెలిపింది. అలహాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన
పిటిషన్లపై ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఈ కేసు ల తుది విచారణను డిసెంబర్ 5
నుంచి చేపడతామని పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించి వేర్వేరు భాషల్లో ఉన్న చారిత్రక దస్త్రాలను ఇంగ్లీషులోకి
అనువదించాలని కక్షిదారులకు సూచించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను 12 వారాల్లోగా పూర్తి
చేయాలని, అలహాబాద్ హై కోర్టు సమర్పించిన సాక్ష్యాల అనువాదాన్ని పది వారాల్లోగా పూర్తి చేయాలని ఉత్త‌ర‌ప్రదేశ్‌
ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.