అయోధ్య కేసును కొత్త ధర్మాసనానికి అప్పగించాలి

 

SUPREME COURT-
SUPREME COURT-

న్యూఢిల్లీ: రామ జన్మభూమి- బాబ్రీ మసీదు  కేసును కొత్త ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయోధ్య వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు  విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ కోసం ఈ నెల 10న కొత్త బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. విచారణ ప్రక్రియపై నూతన ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా అయోధ్య కేసుపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఇంతకు ముందే తిరస్కరించిన సంగతి తెలిసిందే.