అయోధ్య‌లోని వివాదాస్ప‌ద భూమికి సంబంధించిన విచార‌ణ వాయిదా

supreem court
supreem court

ఢిల్లీః అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించిన కేసు తదుపరి విచారణను 2018 ఫిబ్రవరి 8న చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ భూమికి సంబంధించి అలహాబాద్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై మంగళవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, అబ్దుల్‌ నజీబ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సున్నీ వక్ఫ్‌ బోర్డు తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌సిబల్‌ హాజరయ్యారు. కేసు విచారణను 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత చేపట్టాలని అభ్యర్థించారు. అందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సంబంధిత పత్రాల అనువాదానికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కోరడంతో ఫిబ్రవరి 8కి తదుపరి విచారణ వాయిదా వేసింది. పిటిషనర్‌కు ఇదే చివరి అవకాశం అని ధర్మాసనం స్పష్టం చేసింది.