అయేషామీరా కేసులో సత్యంబాబును విచారిస్తున్న సీబీఐ

 

Ayesha meera
Ayesha meera

విజయవాడ: అయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబును ఈరోజు ఉదయం నుండి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నందిగామలో ఆయన నివాసంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. సత్యంబాబు కుటుంబసభ్యుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. అంతేకాక ఇబ్రహీంపటనంలోని శ్రీదుర్గా హాస్టల్‌ నిర్వాహకులను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.