అమ్మ మృతిపై దాఖలైన మరో పిటిషన్‌

Jayalalitha
JAYALALITHA

 

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేపట్టాలంటూ మద్రాస్‌ ధర్మాసనంలో
తాజాగా మరో పిటిషన్‌ దాఖలైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత దీర్ఘకాలంగా అపోలో ఆస్పత్రిలో
చికిత్స పొందుతూ గత ఏడాది డిసెంబర్‌ 5న మృతి చెందిన విషయం తెలిసిందే. పాతిపెట్టిన ఆమె
భౌతికాయాన్ని మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరతూ ఎస్‌ఎ మియాజాన్‌ అనే సామాజిక కార్యకర్త పిటిషన్‌
దాఖలు చేశారు. ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనకు సంబంధించి మానవ నిర్లక్ష్యం
ప్రస్ఫుటంగా కనబడుతోందని పేర్కొన్నారు. తమ ప్రియతమ నేత మృతికి సంబంధించి అసలైన కారణాలను
తెలుసుకొనేందుకు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌ మద్రాస్‌
ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం. సుందర్‌ ధర్మాసనం వద్దకు రాగా,
ఇప్పటికే ఈ అంశంపై దాఖలై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు జతచేయాలని ఆదేశించారు. ఆక్టోబర్‌ 23ప
పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.