అమ్మో…మూడు ముక్కలాట

                                                  అమ్మో…మూడు ముక్కలాట

online rummy
online rummy

                                             ఆన్‌లైన్‌ రమ్మీతో కోట్లు కొల్లగొట్టేస్తున్నారు..కేటుగాళ్లు
                                                   చిన్న పెద్ద తేడా లేకుండా ఆడేస్తున్నారు..
                                                చిన్న కుటుంబాల వారు చితికి పోతున్నారు..
                                                            సామాజిక మాధ్యమాలలో ప్రకటనలతో ఎర..
హైదరాబాద్‌: నగరంలో మూడు ముక్కలాటతో కొంత మంది సర్వం కోల్పోతున్నారు. ఒకప్పుడు వేడుకల్లో.. టైంపాస్‌ కావడానికి ఈ మూడు ముక్కలాటను ఆడేవారు, కాగా కూర్చున్న చోటు నుండి కదలకుండా కాలక్షేపం చేయడానికి దీనిని ఆడేవారు, కాని డబ్బున్న వారు ఈ ఆటలోకి వచ్చి పందేల పోటీలుగా మార్చారు. సంపన్నులు ఈ ఆటలో వందలు, వేలు, లక్షలు ఖర్చుపెడుతున్నారు. కొంతమంది దీనిని టైంపాస్‌ గేమ్‌ గా భావించి ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్కసారి ఈ గేమ్‌లోకి ప్రవేశించిన తరువాత ఆ ఊబి నుండి బయటపడడానికి ప్రయత్నించినప్పటికి ,మళ్లీ తను పోగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుందని ఆశించి ఆడుతూ వాటికి బానిసలా మారుతున్నారు. ఈ అన్‌లైన్‌ రమ్మీ ప్రజలను ఆకట్టుకోవడానికి కొన్ని తాయిలాలతో మభ్యపెడుతున్నాయి. కాగా ఈ ఆట అంతర్జాలంలో నామమాత్రపు రిజిస్ట్రేషన్‌ ఫీీజుతో సామాన్య ప్రజలకు చేరువవుతుంది. కాగా దీనికి అలవాటు పడిన యువత కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించడం కోసం వారు ఈ ఆన్‌లైన్‌ ఆటకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో సర్వం పోగోట్టుకుంటున్నారు. ఈ ఆటకు అవసరమైన డబ్బు కోసం వారు ఇంట్లోని వస్తువులను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఈ ఆట ఆడుతున్నారు. ఆన్‌లైన్‌ కంపెనీలు కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి వారిని ఆకర్షిస్తున్నాయి, అంతేకాకుండా వాటికి ప్రకటనలు ఇచ్చి ,ఈ గేమ్‌ ఆడడం ద్వారా వారు ఇంత గెలుపొందారు మీరు కూడా ఈ ఆటను ఆడండి లక్షలు గెలవండని ప్రకటనలను గుప్పిస్తున్నాయి. ఈ ప్రకటనలకు ఆకర్షితులై వారు లక్షలలో పందేలు కాసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న ఈ ఆన్‌లైన్‌ గేమ్‌లో రమ్మీ ఆడి అప్పులపాలయ్యానని ఒ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు, అదేవిధంగా పొరుగురాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఈ ఊబిలో దిగి ఉన్నదంతా పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ వచ్చినప్పటి నుండి క్లబ్బులలో పేకాటపై నిషేధం విధించారు. దీంతో వారు ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కొంత మంది ఈ ఆటకు అలవాటు పడుతున్నారు కాగా ఈ ఆట పై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ,ఈ ఆటను పిల్లలతో సహా అన్నివర్గాల
వారు కూడి ఈ ఆటకు అలవాటు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో రమ్మీ ద్వారా లక్షలు సంపాదించవచ్చని ప్రముఖులతో ప్రకటనలు ఇవ్వడం, సెల్‌ఫోన్‌లకు సందేశాలు పంపడం, వాట్సప్‌, ఫేస్‌బుక్‌లలో మెసేజ్‌లు పంపడం కొత్తగా ఈ ఆన్‌లైన్‌ రమ్మీలో చేరిన వారికి 1000 రూపాయలు బోనస్‌గా వస్తాయని ప్రకటిస్తున్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ నిర్వాహణకు అధీకృత యంత్రాంగం లేదు. మైనర్‌లు కూడా మేజర్‌ అని రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆడుకునే వీలుంది. రమ్మీ ఆటలో కార్డులను అటూఇటూ మారుస్తారు. ఇది ఆన్‌లైన్‌లోని ఆటగాళ్లకు తెలియదు, అయితే కార్డులను పంచే డీలర్లకు మాత్రం వాటి మార్పిడి స్ఫష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కార్డులు పంచే డీలర్‌ వాటిని మార్చడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ రమ్మీ డీలర్‌(కంపెని)కి చెందిన కొంత మంది ఆటగాళ్లు ఇందులో ఉంటారు వారు మిగితా వాళ్ల మాదిరిగానే ఆటలో పాల్గొంటారు మూడో ఆటగాడికి తెలియకుండా ఇద్దరూ కుమ్మక్కౖెె మోసానికి పాల్పడవచ్చు. ఒక ఆటగాడు టేబుల్‌ పై కిందికి వదిలిన కార్డు ఒకటి ఉంటే కంపెనీకి చెందిన సొంత ఆటగాడు తీసుకునే కార్డు మారిపోయి మరోటి చేరుతుంది, దీనివల్ల కంపెనీకి చెందిన ఆటగాడికి కావల్సిన కార్డు అందుతుంది. ఆన్‌లైన్‌ గెలుపొందిన వారికి నగదు కాకుండా కూపన్లు కాయిన్లు ఇస్తారు వీటిని మరోసారి ఆటకు వినియోగించుకోవచ్చు. బ్యాంకులో నగదుగా మార్చుకోవడానికి 24గంటలు పడుతుంది. ఆన్‌లైన్‌ ఆటలో మోసపోతే చెప్పుకోవడానికి దిక్కులేదు, డీలర్‌తో సంబంధం ఉండదు. తనతో ఆడిన ఆటగాడు ఎవరో కూడా తెలియకపోవడం కూడా ఆ దుస్ధితికి కారణం. ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటు పడిన వారు తమ సంపాదన మొత్తం పందెంలో పెడుతున్నారు. దీంతో కుటుంబం ఆర్ధికంగా నష్టపోయి రోడ్డున పడుతున్నారు, చివరుకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు, కాగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఆన్‌లైన్‌ రమ్మీ చిచ్చురేపుతుంది, ఈ ఆట ఆడడానికి కంప్యూటర్లు ,సెల్‌ఫోన్‌లు కాస్త అవగాహన ఉన్నవారు కూడా ఈ గేమ్‌ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఆట మొదట్లో ఆడేవారికి కొంత మొత్తం గెలుపొందగానే వారు ఆశతో ముందుకు వస్తారు
వచ్చిన వారిని ఈ ఊబిలోకి దిగిన వారిని బయటకు రాకుండా చేస్తున్నాయి. దేశంలో ఆన్‌లైన్‌ రమ్మీ ద్వారా వచ్చే ఆదాయం 3700 కోట్లుకు చేరుకుంటుందని అంచనా ,పలు కంపెనీలు ఈ రంగంలో కోట్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఈ ఆటను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తరిస్తున్నారు.
తెలంగాణలో నియంత్రించడానికి సర్కారు ప్రయత్నం:-
ఈ ఆన్‌లైన్‌ రమ్మీని నియంత్రించడానికి కేంద్రంలో ఎలాంటి చట్టం లేదు, నైపుణ్యంతో కూడిన ఆటగా కంపెనీలు పేర్కొంటున్నాయి సమాజంపై ఇది చూపుతున్న దుష్ప్రభావాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గేమింగ్‌ చట్టం 1974 ను రెండు సార్లు సవరిస్తూ ఈ ఏడాది జూన్‌, జులైలో ఆర్డినెన్స్‌లను సవాలు చేస్తూ పలు కంపెనీలకు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి, కాగా ఈ ఆటను నైపుణ్యంతో కూడినదిగా కంపెనీలు చెబుతుంటే కాదు జూదంగానే చూడాలని ప్రభుత్వం అంటుంది. తెలంగాణలో ఈ ఆట వల్ల మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు చితికిపోతున్నారు. ఈ ప్రభావం మహిళలపై పడుతుంది. కాగా ఈ మధ్య పేకాట రాయళ్లు ఎవరికి చిక్కకుండా ఉండటం కోసం స్టార్‌ హోటళ్లలో ఎవరికి అనుమానం రాకుండా రూంలను బుక్‌చేసుకుని అక్కడ ఎవరికి తెలియకుండా జూదదారులు పేకాట ఆడేస్తున్నారు. రాజధానిలో పేకాట శిబిరాల నిర్వహణపై నిషేదాజ్ఞలు ఉండటంతో ఈ ఆటపై ఆసక్తి ఉన్న వారిని ఒకేచోట కలపడం కోసం ఈ తరహా ఉపాయాలను చేస్తున్నారు. కాగా కొంతమంది ఈ ఆట కోసం పొరుగు
రాష్ట్రాలకు వెళ్లి ఆడివస్తున్నారు. వారికి కావల్సిన అన్నిరకాల అవసరాలను వారు తీరుస్తున్నారు, కాగా ఆ ఆటకు అలవాటు పడి కొందరు సర్వం కొల్పోతున్నారు. మధ్యతరగతి కుటుంబాల వారు ఈ ఆటలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాగా తెలంగాణ వచ్చాక ప్రభుత్వం పేకాట ఏ రూపంలో ఉన్న వాటిని నిషేధించడం జరిగింది, కాని ఆన్‌లైన్‌ రమ్మీ నియంత్రించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలంగాణ గేమింగ్‌ చట్టం 1974 లోని నిబంధనలకు కొన్ని రకాలుగా ఆన్‌లైన్‌ రమ్మి ద్వారా జరిగే సామాజిక దుర్వినియోగాన్ని తగ్గించడం కోసం 2017 జూలై 8న ఆర్డినెన్స్‌ విడుదలైందని సమాచారం. రాష్ట్రంలోని పలువురు వ్యక్తులకు, ముఖ్యంగా యువకులకు ఆన్‌లైన్‌ రమ్మి ఒక వ్యసనం కావడం ద్వార, వారి కుటుంబంపై ప్రభావం చూపుతుందని దీనిని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది. తెలంగాణ స్టేట్‌ గేమింగ్‌ ఆర్డినెన్స్‌2017 ప్రకారం రమ్మీ పాక్షికంగా అదృష్టం లేదా అవకాశంగా ఉన్నందున ఇది నైపుణ్యం ఉన్న ఆట కాదు అని పేర్కొంది.