అమ్మాయిల్లో దంత సమస్యలు

                                 అమ్మాయిల్లో దంత సమస్యలు

teeth pain in ladies
teeth pain in ladies

మగవారితో పోలిస్తే ఆడవారు వారి శారీరక, రసాయనిక ప్రవృత్తులు, విధి నిర్వహణలు వేర్వేరుగా ఉండటంతో వాటి ధాటికి తలవంచక తప్పదు. ఆడవారు రజస్వల అయిన తరువాత ప్రతినెలా బహిష్టులు కావడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో రక్తంలో కొన్ని రసాయనిక మార్పులు జరుగు తాయి. అంటే స్త్రీ హార్మోన్స్‌ (ఈస్ట్రోజెన్స్‌) శాతం తగ్గుతుంది. తద్వారా రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గుతుంది. దీని వల్ల రక్తం పలుచ బడు తుంది.బహిష్టు సమయంలో రక్తం చాలా పలుచగా ఉంటుంది కనుక చిగుళ్లకు ఏమాత్రం ఒత్తిడి కాని, గాయం కాని అయితే, చిగుళ్లలో ఉన్న రక్త కేశ నాళికలు పగిలి చిగుళ్లనుండి రక్తం స్రవిస్తుంది. ఈ దశలో బాక్టీరియా చిగుళ్ల కణజాలంలోకి ప్రవేశిస్తుంది. క్రమేణా చిగురులో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని చిగుళ్ల వ్యాధికి నాందిగా, ప్రారం భదశకు ఉపక్రమిస్తుంది.

ఇలా ప్రతినెలా బహిష్టు సమయంలో ఏర్పడే స్త్రీ హార్మోన్లు తగ్గడం, పెరగ డం మొదలైన హెచ్చుతగ్గుల వల్ల బాక్టీరియాకు అనుకూల వాతావరణం ఏర్పడి చిగుళ్ల వ్యాధి నెలనెలకూ పెరుగతూపోతుంది. చిగుళ్ల వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అంటే ఈ వ్యాధి వల్ల నొప్పి ఉండదు. చాలా తక్కువగా చిగుళ్లనుంచి రక్తం వస్తుంది. నాలుగైదు సంవత్సరాల తరువాత ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ మొదట్లో వీటిని అశ్రద్ధ చేయడం జరుగుతుంది. చిగుళ్ల వ్యాధి బాగా ముదిరి, చిగుళ్ల వాపులు, చిగుళ్లనుంచి రక్తం, చీము రావడం, పంటికి పంటికి మధ్య ఖాళీలు ఏర్పడటం, నోటి దుర్వాసన, చివరకు పళ్లు కదలిపోయి ఊడిపోవడం జరుగుతాయి.అమ్మాయిలు అందరూ కూడా చిగుళ్ల వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి, ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించి పళ్లను, చిగుళ్లను పరీక్షింపజేసుకోవాలి.