అమ్మాయిలు బీర్లు తాగ‌డం ఆందోళ‌న క‌ల్గిస్తుందిః పారిక‌ర్‌

manoher pariker
manoher pariker

ప‌నాజీః గోవాలో అమ్మాయిలు బీర్లు సేవించడం ఆందోళన కలిగిస్తుందని ఆ రాష్ట్ర సీఎం మనోహర్ పారికర్ అన్నారు. నిన్న గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్‌లో మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. అమ్మాయిలు బీర్లు సేవించడం.. నిజంగా తనకు భయమేస్తుందన్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉందని తెలిపారు. అమ్మాయిలందరూ బీర్లు సేవిస్తున్నారని తాను అనడం లేదు. ఇక్కడున్న వారిలో కొందరైనా బీర్లు తాగే వారు ఉండి ఉంటారని పారికర్ పేర్కొన్నారు. గత రెండేళ్లలో బీర్లు తాగే అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని గోవా సీఎం గుర్తు చేశారు.