అమ్మాయిని చదివించండి

నీతి కథ
                     అమ్మాయిని చదివించండి

GIRL EDUCATION
GIRL EDUCATION

అనగనగా ఒక ఊరిలో భార్య భర్తలు ఉన్నారు. వారికి పెళ్లయిన చాలా సంవత్సరాల తరువాత ఒక కొడుకు. కూతురు పుట్టారు. వారు కొడుకును ప్రైవేట్‌ పాఠశాలలో వేసి కూతురును ప్రభుత్వ పాఠశాలలో వేశారు. కొడుకు ఎప్పుడు ఏది అడిగినా అమ్మనాన్న ఇచ్చేవారు. కానీ కూతురుకు మాత్రం ఏది అడిగిన దానిలో సగం, లేదా ఏమి ఇచ్చేవారుకాదు. ఆ కూతురు మాత్రం మా అమ్మనాన్నలే కదా అని సర్దుకునేది. కొడుకు మాత్రం ఏది అడిగిన ఇచ్చేదాక పట్టుపట్టేవాడు. అలా వారిద్దరు చదువ్ఞతు 10వ తరగతికి వచ్చారు. వారి కొడుక్కి 7జిపిఎ వచ్చింది. కాని కూతురుకు మాత్రం 9.8 జిపిఎ వచ్చింది.

అయితే వారు వారి కొడుకును ప్రైవేట్‌ కళాశాలలో వేసారు. కూతురును మాత్రం ప్రభుత్వ కళాశాలలో వేసారు. అలా చేసినాగాని కూతురు ఏమి బాధ పడలేదు. అలా ఇద్దరికి మంచి ఉద్యోగం వచ్చింది వారు వారి ఇద్దరికి పెళ్లి చేసారు. కొడుకు పెళ్లి అయిన కొన్ని రోజులకు తరువాత ఆ తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టాడు. వారికి అనా రోగ్యం చేసినా వారికి ఎటు వంటి చికిత్స చేయించలేదు. అది తెలిసిన కూతురు తన అమ్మనాన్నలను తన ఇంటికి తీసుకెళ్లి వారికి మంచి ఆసుపత్రిలో చూపించి వారికి ఎటువంటి అసౌక ర్యం లేకుండా చూసుకుంది. అప్పుడు తన అమ్మనాన్న వారు చేసినతప్పును తెలుసుకుని తన కూతురితో ఏడుస్తు అమ్మా మేము నా కూతురికి పెళ్లిచేస్తే వెళ్లి పోతుందిలే అని నిన్ను తక్కువ చూసాము మాకు ఇద్దరూ సమానమే.

ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైన సరే కొడుకు కొడుకే.. నాకు రేపు ఇంత కూడు పెట్టే వాడు అని కూతురు ఒక ఇంటికిస్తే వెళి ్లపోతుంది అని వారు కూతురికి కొడుక్కు ఇచ్చిన సదుపాయలు ఇవ్వకుండా చూసారు. కూతురిని కూడా కొడుకుతో సమానంగా చూస్తే ఆ కూతురు కూడ నేను ఎందులో తక్కువ కాదు అని నిరూపిస్తారు. దయచేసి ఈ ప్రపంచంలో ఏ తల్లి దండ్రులైన సరే మీ కూతురికి కొంచెం స్వేచ్ఛను ఇవ్వండి అప్పుడు వారు కూడా వారి ప్రతిభను చూపిస్తారు. వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. దయచేసి నాన్న నేను చదువ్ఞకుంటాను అని అన్న ప్రతి అమ్మాయిని చదివించండి.

జి. వేణు, 10వ త‌ర‌గ‌తి, కుకునూర్‌ప‌ల్లి