అమ్మపై నమ్మకమే అన్నిటికీ పరిష్కారం

వ్యధ

crying
crying

అమ్మపై నమ్మకమే అన్నిటికీ పరిష్కారం

నా వయసు 32 ఏళ్లు. 19 ఏళ్లకే పెళ్లి చేశారు. పెళ్లయిన ఏడాదికే మగబిడ్డకు తల్లినయ్యాను. నాలుగేళ్లకే ప్రమాదం నా భర్తను పొట్టనబెట్టుకున్నది. చిన్నతనంలోనే మోడువారిన నా జీవితాన్ని చూసి అమ్మా, నాన్న, అయినవారు తట్టుకోలేకపోయారు. మరొక వ్యక్తిని తోడు తెచ్చుకొమ్మని బలవంతం చేశారు. బాబుకు సరిగా ఊహ తెలియకముందే మరొక పెళ్లి చేసుకోవడం మంచిదని సూచించారు. హితుల మాట కాదనడం మంచిది కాదని రెండో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. మాది పేద కుటుంబం. నేను 10వ తరగతి వరకు చదువ్ఞకున్నాను. పైగా రెండవ పెళ్లి కావడంతో మంచి సంబంధం దొరకడం కష్టమైంది. దాంతో నాకంటే పదేళ్లు పెద్దవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అతను ఒక ప్రైవేటు హోటల్లో మాస్టర్‌గా పనిచేసేవారు. రోజుకు 500 రుపాయలు సంపాదించేవాడు. నా భర్త చనిపోయిన సమయంలో లక్ష రూపాయలు బీమా డబ్బు వచ్చింది. దాన్ని వడ్డీకి ఇవ్వడం వల్ల నెలకు రెండు వేలు వస్తున్నది. కాబట్టి నా రెండవ భర్త సంపాదన, వడ్డీ డబ్బుతో సంసారం గడిచిపోతుందన్న నమ్మకం కలిగింది. అయితే నా నమ్మకం వమ్మయింది. అతనికి చాలా వ్యసనాలు, అప్పులు వ్ఞన్నాయని ఆలస్యంగా తెలిసింది. అలాగే చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడన్న విషయం బయటపడింది. పెళ్లయిన నెలకే నాకు ‘వెనీరియర్‌ డీసీస్‌ వచ్చింది. పరీక్షించిన డాక్టర్‌ ఇది నా భర్త ద్వారా సంక్రమించిన సుఖవ్యాధిగా నిర్ధారించింది. దాంతో ఆయన వ్యసనాలు, చెడు తిరుగుళ్లు బయటపడ్డాయి. చేసేదిలేక ఆయన్ను మార్చుకునేందుకు పలువిధాలుగా ప్రయత్నం చేసి విఫలమయ్యాను. పైగా అతను నాలుగు రోజులకు ఒకసారి కూడా స్నానం చేయరు, బట్టలు మార్చుకోరు, గడ్డం గీసుకోరు. దీంతో మా ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు, సఖ్యత దెబ్బతిన్నాయి. గత్యంతరం లేక, విడాకులు తీసుకుంటే పరువుపోతుందని భయపడి బాధలు దిగమింగి సంసారం చేస్తున్నాను. భర్త సంపాదనపై ఆధారపడకూడదని నిర్ణయించుకుని టైలరింగ్‌ నేర్చుకున్నాను.

బట్టలు కుట్టే వృత్తిని జీవనాధారంగా మార్చుకున్నాను. ఉన్న ఒక్క బాబును పెంచి ప్రయోజకుడిని చేయడమే లక్ష్యంగా జీవిస్తున్నాను. అయితే బాబు విపరీత ప్రవర్తనలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అబద్దాలు చెప్పడం, చిన్నచిన్న దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. అప్పుడప్పుడు చెప్పకుండా మా అమ్మావాళ్ల ఊరెళ్లిపోతాడు. అమ్మమ్మ వద్దే ఉండిపోతానని మొండికేస్తాడు. అతని కోసమే నేను బ్రతుకున్నానని, ఇన్ని బాధలు పడుతున్నానని ఎంత చెప్పినా అతనిలో మార్పు రావడం లేదు. పదిరోజుల క్రితం తెల్లవారుజామున లేచి కూరలు తరిగే కత్తి తీసుకుని రెండు చేతులపై గాట్లు పెట్టుకున్నాడు. కత్తిని మెడవద్ద పెట్టుకుని నిద్రపోయాడు. లేచి చూసిన నాకు మతిపోయినంత పనయ్యింది.

అలా ఎందుకు చేశావని నిలదీస్తే తనకు తెలియకుండానే అలా చేసుకున్నానని చెప్పాడు. పక్క పట్టణంలో వ్ఞన్న సైకియాట్రిస్టుకు చూపిస్తే ఏవో మందులు రాసిచ్చి, సైకాలజిస్టు ద్వారా కౌన్సెలింగ్‌ చేయించమని చెప్పారు. ఈ నేపధ్యంలో నా కొడుకుని మార్చుకునే మార్గం చెప్పండి.
– కౌసల్య, ఒంగోలు
అమ్మా! విూ సమస్యలను అర్ధం చేసుకున్నాను. ప్రతికూల పరిసరాలే విూ మనోవేదనకు కారణం. విూ భర్త వ్యవహారశైలి, ప్రవర్తన మార్చలేనివేవిూ కాదని గుర్తించండి. అతను పెరిగిన వాతావరణం, పెరిగినతీరు, వంటబట్టించుకున్న అలవాట్ల వల్ల అతను అలా తయారయ్యారనిపిస్తున్నది. విూరు అతని కుటుంబ నేపధ్యం రాయలేదు. అయినా అతను తల్లిదండ్రులకు దూరంగానో లేక తల్లిదండ్రులు లేని వ్యక్తి అయింటాడని భావించాల్సి వస్తున్నది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవాల్సి రావడం వల్ల చెడుతిరుగుళ్లకు అలవాటు పడివ్ఞంటాడు. అలాగే నా అన్నవాళ్లు లేకపోవడం వల్ల, ఒంటరితనం నుంచి బయటపడటానికి వ్యసనాలకు బానిస అయిఉండవచ్చు.

మిమ్మల్ని పెళ్లి చేసుకున్న వెంటనే పాత అలవాట్లను మానుకోలేకపోయి ఉంటారు. అతని ప్రవర్తనను మార్చాలన్న ఉద్దేశంతో విూరు కొంత కఠినంగానో లేక మొండిగానో వ్యవహరించి ఉంటారు. దీంతో విూ మధ్య దూరం పెరిగి ఇద్దరు బాధపడుతున్నారు. అనుభవమున్న సైకాలజిస్టు ద్వారా విూ వారికి కౌన్సెలింగ్‌ చేయిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. కాగ్నెటివ్‌ బిహేవియర్‌ ధెరపి, రిలాక్సేషన్‌ పద్ధతులు, ఇతర మార్గాల ద్వారా ఆయనలో పరివర్తన తీసుకుని రావచ్చు. కాగా విూ అబ్బాయి సమస్యకు విూ ఇంటి వాతావరణమే కారణంగా భావించవచ్చు. సహజంగానే పిల్లలు మారు తండ్రిని అంగీకరించలేరు. తండ్రికాని తండ్రి పెత్తనాన్ని సహించలేరు. అలాగే తల్లిని బాధపెట్టే వ్యక్తుల పట్ల ప్రతీకారవాంఛ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.

విూ భర్త ప్రవర్తన, తీరుతెన్నులను విూ అబ్బాయి కూడా సహించలేకపోతుండవచ్చు. అతను మిమ్మల్ని బాధించడం చూసి ప్రతీకారేక్ష పెంచుకుని ఉండవచ్చు. అయితే విూరు నిత్యం బోధించే హితోపదేశాలు, ద్యైత అతనిలో ఆత్మన్యూనతను పెంపొందించి ఉంటాయి. ఈ నేపధ్యంలో మారుతండ్రిని కట్టడి చేయలేక, మిమ్మల్ని ఆదుకోలేక ఆ చిన్ని హృదయం సంఘర్షణకు గురవ్ఞతుండవచ్చు. అందుకే అతను ఇల్లు వదిలి వెళ్లిపోవడం చేస్తున్నాడనిపిస్తుంది. అలాగే తండ్రికాని తండ్రికి ఏవిూ చేయలేని నిస్సహాయస్ధితిలో కత్తితో గాట్లు పెట్టుకుని స్వీయహింసకు పాల్పడి వ్ఞంటాడు. కాబట్టి అతనికి కౌన్సెలింగ్‌ చేయించడం మంచిది. అలాగే విూరు కూడా మారడానికి ప్రయత్నించండి. బాధల్ని తలచుకుంటూ, వేదనకు గురవడం మానండి. పరిష్కారమార్గాలను అన్వేషించండి. విూరు పదవ తరగతి వరకు చదివారు కాబట్టి సార్వత్రిక విద్యాపద్ధతి ద్వారా విద్యార్హతలు పెంచుకోండి.

సానుకూల దృక్పధం, ఆశావాదంతో భర్త, కుమారునిలో మార్పుకోసం ప్రయత్నించండి. భర్త పట్లఉన్న అసహనాన్ని తొలగించుకుని, దాంపత్య జీవితాన్ని పునరుద్ధరించుకోండి. విూ బాబులో గూడుకట్టుకున్న భయం, కసి, క్రోధ లాంటి ప్రతికూల భావాలను తొలగించేందుకు కృషి చేయండి. జీవిత సత్యాలు, జీవన ప్రమాణాలు, సామాజిక పరిస్థితుల పట్ల భర్త, కొడుకులకు అవగాహన కల్పించండి. తప్పకుండా విూ దాంపత్య జీవితం సుఖమయమవు తుంది.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌ రెడ్డి, సైకాలజిస్ట్‌