అమ్మఒడి డబ్బులు నాన్న గొంతుతడికి ఖర్చవుతున్నాయి

ఏపి టిడిపి ఎంపి కేశినేని నాని

kesineni nani
kesineni nani

అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 40 రోజులుగా మద్యం ప్రియులు మద్యనికి దూరంగా ఉన్నారు. కేంద్రం అనుమతించడంతో ఏపిలో కూడా నిన్నటి నుండి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లుగా ఓపిక పట్టిన జనాలు మద్యం దుకాణాలు తెరవడంతో మందు షాపులకు పోటెత్తారు. పలు చోట్ల వందల మీటర్ల మేర జనాలు బారులు తీరారు. దీనిపై టిడిపి ఎంపి కేశినేని నాని ట్విట్టర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. అమ్మఒడి పథకం డబ్బులు నాన్న గొంతు తడి పథకం కోసం ఖర్చయిపోతున్నాయని అమ్మలు వాపోతున్నారు జగనన్నా అంటూ ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/