అమెరికా యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

Trump
Trump

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో ప్రతిష్టాత్మక ఆర్డర్‌పై సంతకం చేశారు. తన పరిపాలనలో యువ అమెరికన్లకు
ఉత్తేజకరమైన, అద్భుతమైన కెరీర్‌ అవకాశాలను మార్గం సుగమం అయింది. ఈ దిశగా సరికొత్త కార్యనిర్వాహక ఆర్డర్‌పై ఆయన
సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలోని యువతకు ఉద్యోగనైపుణ్యతను సాధించేందుకు ఔత్సాహిక శిక్షణా కార్యక్రమాలను అందించనున్నారు. ఈ పథకంలో అమెరికన్లు ఉత్తేజకరమైన , సంతృప్తికరమైన వృత్తికి మార్గాన్ని ఎంచుకోవచ్చు. తద్వారా దేశ మానుఫాక్చ‌రింగ్‌ రంగంలో పునరుజ్జీవింపజేసే క్రమంలో యువత అద్భుతమైన సాంకేతిక నిపుణులుగా మారతారని ట్రంప్‌ వెల్లడించారు.